పేదలకు అండగా ప్రభుత్వం
ABN , First Publish Date - 2023-05-27T02:09:09+05:30 IST
:పేదలకు అండగా ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.

హుజూర్‌నగర్, మే 26:పేదలకు అండగా ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గరిడేపల్లి మండలం కీతవారిగూడెంకు చెందిన 50 కుటుంబాలు బీఆర్‌ఎ్‌సలో చేరాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి బీఆర్‌ఎస్ లో చేరుతున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు యథావిఽధిగా అమలవుతాయన్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలకపాత్ర పోషించనున్నారని అన్నారు. మోదీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన ప్రజలు నమ్మరని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కీతా జ్యోతి, రామరావు, పెండెం శ్రీనివాస్, కడియం వెంకటరెడ్డి, మామిడి వెంకటేశ్వర్లు, సైదాహుస్సేన్, ఆనంద్‌బాబు, అంజి, కీతా నాగరాజు, సురేష్, నరేష్, గోపాల్ పాల్గొన్నారు.