క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
ABN , First Publish Date - 2023-08-02T00:24:25+05:30 IST
జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డులను పొందిన క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ అన్నారు.
తుంగతుర్తి, ఆగస్టు 1: జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డులను పొందిన క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ అన్నారు. వరల్డ్ కబడ్డీ ఫెడరేషన ఆధ్వర్యంలో మధ్యప్రదేశలో ఇటీవల నిర్వహించిన అండర్- 19 జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మండలంలోని వెంపటి గ్రామానికి చెందిన కొండగడపల చందు, భాషబోయిన ప్రవీణ్, రావుపల్లికి చెందిన గగులోతు సంతోష్‌ను మంగళవారం అభినందించి మాట్లాడారు. ఫైనల్ మ్యాచలో మహారాష్ట్ర జట్టుతో తలపడి రన్నర్‌గా నిలిచి తెలంగాణ రాష్ట్రానికి ద్వితీయ బహుమతి తీసుకురావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో హరీష్ పాల్గొన్నారు.