గణపతి బప్పా మోరియా
ABN , First Publish Date - 2023-09-20T00:17:44+05:30 IST
వినాయక చవితి సందర్భంగా గణపతి బప్పా మోరియా....జై బోలో గణేష్ మహారాజ్‌కి జై అంటూ భక్తిశ్రద్ధలతో యువకులు, చిన్నారులు గణనాథుడి విగ్రహాలను నెలకొల్పారు.

వినాయక చవితి సందర్భంగా గణపతి బప్పా మోరియా....జై బోలో గణేష్ మహారాజ్‌కి జై అంటూ భక్తిశ్రద్ధలతో యువకులు, చిన్నారులు గణనాథుడి విగ్రహాలను నెలకొల్పారు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించి పూజల్లో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, చైర్‌పర్సన్ అన్నపూర్ణ పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాల యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహం వద్ద మంత్రి జగదీష్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు. వినా యక చవితి వ్రత కల్ప విధానం పుస్తకాలను నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం పజ్జూరుకు చెందిన మాజిద్ అహమద్ ఇంటింటికీ పంచి పెట్టారు. ఆ యువకుడిని మంత్రి అభినందించారు. కార్యక్రమంలో మంత్రి జగదీష్‌రెడ్డి తండ్రి గుంటకండ్ల చంద్రారెడ్డి, కుమారుడు వేమనరెడ్డి, నకిరేకల్, తుంగతుర్తి ఎమ్మెల్యేలు లింగయ్య, కిషోర్ కుమార్, ఎస్పీ రాజేంద్రప్రసాద్, సైదులుయాదవ్ పాల్గొన్నారు.
-ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్