ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం

ABN , First Publish Date - 2023-06-03T01:22:10+05:30 IST

రాష్ట్రానికి ఏం చేశారని దశాబ్ది ఉత్సవాలు సూర్యాపేట సిటీ, జూన 2: తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారని సీఎం కేసీఆర్‌ దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు ప్రశ్నించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చినందుకు ప్రజలందరూ సంతోషం గా ఉన్నా, తొమ్మిదేళ్లుగా రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీగా ఉన్నందుకు బాధపడుతున్నారని అన్నారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత దృష్ట్యా తెలంగాణ వాదాన్ని అడ్డుపెట్టుకుని సీఎం కేసీఆర్‌ మరోమారు అధికారంలోకి రావాలని చూస్తున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎ్‌సగా మార్చినప్పుడే తెలంగాణ అనే పదాన్ని ఉపయోగించే నైతిక హక్కును కేసీఆర్‌ కొల్పోయారన్నారు. ఆనాడు తెలంగాణ బిల్లుకు రాజ్యసభలో బీజేపీ మద్దతు తెలిపిందన్నారు. అనంతరం తెలంగాణ ఉద్యమం సందర్భంలో జైలు జీవితం గడిపిన చల్లమల్ల నరసింహారావు, కట్ల సైదులుగౌడ్‌, తోట లక్ష్మీనారాయణ, సుభా ష్‌ను సంకినేని సన్మానించారు. ముందుగా తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. సమావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గజ్జల వెంకటరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎండీ అబీద్‌, కర్నాటి కిషన, వల్థాస్‌ ఉపేందర్‌, సంధ్యాల సైదులు, పందిరి రాంరెడ్డి, పోకల రాములు, శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న సంకినేని వెంకటేశ్వర్‌రావు డంపింగ్‌ యార్డుకు నిప్పుతో ప్రజల ఉక్కిరిబిక్కిరి నేరేడుచర్ల, జూన్‌ 2: మునిసిపాలిటీ పరిధిలోని బట్టువానికుంట గ్రామంలో డంపింగ్‌ యార్డుకు ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో పొగతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గ్రామానికి 50మీటర్ల దూరంలో బండమీద డంపింగ్‌ యార్డును ఏర్పాటుచేయడాన్ని ఆ సమయంలో స్థానికులు వ్యతిరేకించారు. వేసవికాలం అయినందున ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో ఈ ప్రాంతం మొత్తం పొగమయంగా మారింది. ఇళ్లలో ఉండే పరిస్థితి లేనందున ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఊరంతా పొగ కమ్ముకోవడంతో ప్రజలు వ్యవసాయ భూముల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొగ తగ్గిన తర్వాతే ఇళ్లకు వచ్చే పరిస్థితి ఉంది. నిబంధనలను విరుద్ధంగా గ్రామానికి ఆనుకుని డంపింగ్‌ యార్డు ఏర్పాటుచేయడంపై ఎనిమిదో వార్డు కౌన్సిలర్‌ సరిత ఆగ్రహం వ్యక్తం చేశారు.డంపింగ్‌ యార్డును వెంటనే తరలించాలని కోరారు. గ డ్డివాము దగ్ధం మద్దిరాల, జూన్‌ 2: మండల కేంద్రంలో గడ్డివాము దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల శివారులో వ్యవసాయ బావులు వద్ద కొంతమంది రైతులు శుక్రవారంవరి కొయ్యలను నిప్పు పెట్టారు. ఈ మంటలు ఉన్న వల్లపు రమేష్‌ గడ్డివాముకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని దగ్ధమైంది. ఈ మంటలు చుట్టుపక్కల 10ఎకరాలకు విస్తరించగా, రైతులు అప్రమత్తమై మంటలను ఆర్పడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో రమే్‌షకు చెందిన రూ.10వేల విలువైన 100 మోపుల గడ్డి దగ్ధమైంది.

ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న దేవరశెట్టి శారదాంబను సన్మానిస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగుర వేశారు. జిల్లా కేంద్రంతో పాటు పలు మండల కేంద్రాల్లో తెలంగాణ ఉద్యమకారులను సన్మానించారు. తిరుమ లగిరిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలను నెరవే రుస్తున్నామన్నారు. ఈ నెల 22వరకు దశాబ్ది ఉత్స వాలను పండుగ వాతావరణంలో నిర్వహించు కోవా లన్నారు.

- సూర్యాపేట మునిసిపల్‌ కార్యాలయంలో.. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ జాతీయ జెండా ఎగురవేసి అమరులను నివాళులర్పించారు.

- జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ పార్టీ, జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

-తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో కుంట్ల ధర్మార్జున జాతీయ జెండా ఎగురవేశారు.

- జిల్లా కేంద్రంలోని రెడ్‌హౌజ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌, అంజద్‌అలీ జాతీయ జెండాను ఎగురవేశారు.

- జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయం ఆవరణలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

- తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా చైర్మన్‌ అనంతుల మధు జాతీయ జెండాను ఎగురవేసి అమరవీరులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో బొడ్డు కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

- సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్‌కుమార్‌ జెండా ఎగురవేసి మాట్లాడారు. కార్యక్రమంలో సైదులుపాల్గొన్నారు.

- జిల్లా కోర్టు కార్యాలయంలో జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జీ జి. రాజగోపాల్‌ జాతీయ జెండా ఎగురవేసి పోలీస్‌ గౌరవ వందనం స్వీకరించారు.

-ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం ఆద్వర్యంలో ఆసంఘ నాయకులు ఆర్‌.సీతారామయ్య, కేతిరెడ్డి రవీందర్‌రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు.

-60ఏళ్లలో చేయలేని అభివృద్ధిని కేవలం తొమ్మిదే ళ్లలో చేసి చూపించామని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ అన్నారు. కోదాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.

- కోదాడ కోర్టుల అడిషిననల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జీ భవ్య, సెకండ్‌ క్లాస్‌ మెజిస్ర్టీట్‌ సత్యనారాయణ, బార్‌ అసోసయేషన అధ్యక్షుడు దేవబత్తిని నాగార్జునరావు పలువురు న్యాయవాదులు తెలంగాణ అమరవీరుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జూనియర్‌ న్యాయవాదులు, కోర్టు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

- దశాబ్ది ఉత్సవాలపై హుజూర్‌నగర్‌లోని టౌన్‌హాల్‌లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సమీక్ష చేశారు.

- అన్ని మండల కేంద్రాల్లో ఎంపీపీలు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజల్లో నిరాశ: పద్మావతి

బీఆర్‌ఎస్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు నిరాశతో ఉన్నారని కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్‌ పద్మావతిరెడ్డి అన్నారు. కోదాడలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో సోనియాగాంధీ చిత్రపటానికి కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమరుల త్యాగాలను సోనియాగాంధీ గుర్తించి ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని ఇచ్చారన్నారు. కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు మాజీ సర్పంచ పారా సీతయ్య, వంగవీటి రామారావు పాల్గొన్నారు.

- ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌

రాష్ట్రానికి ఏం చేశారని దశాబ్ది ఉత్సవాలు

సూర్యాపేట సిటీ, జూన 2: తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారని సీఎం కేసీఆర్‌ దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు ప్రశ్నించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చినందుకు ప్రజలందరూ సంతోషం గా ఉన్నా, తొమ్మిదేళ్లుగా రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీగా ఉన్నందుకు బాధపడుతున్నారని అన్నారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత దృష్ట్యా తెలంగాణ వాదాన్ని అడ్డుపెట్టుకుని సీఎం కేసీఆర్‌ మరోమారు అధికారంలోకి రావాలని చూస్తున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎ్‌సగా మార్చినప్పుడే తెలంగాణ అనే పదాన్ని ఉపయోగించే నైతిక హక్కును కేసీఆర్‌ కొల్పోయారన్నారు. ఆనాడు తెలంగాణ బిల్లుకు రాజ్యసభలో బీజేపీ మద్దతు తెలిపిందన్నారు. అనంతరం తెలంగాణ ఉద్యమం సందర్భంలో జైలు జీవితం గడిపిన చల్లమల్ల నరసింహారావు, కట్ల సైదులుగౌడ్‌, తోట లక్ష్మీనారాయణ, సుభా ష్‌ను సంకినేని సన్మానించారు. ముందుగా తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. సమావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గజ్జల వెంకటరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎండీ అబీద్‌, కర్నాటి కిషన, వల్థాస్‌ ఉపేందర్‌, సంధ్యాల సైదులు, పందిరి రాంరెడ్డి, పోకల రాములు, శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న సంకినేని వెంకటేశ్వర్‌రావు

డంపింగ్‌ యార్డుకు నిప్పుతో ప్రజల ఉక్కిరిబిక్కిరి

నేరేడుచర్ల, జూన్‌ 2: మునిసిపాలిటీ పరిధిలోని బట్టువానికుంట గ్రామంలో డంపింగ్‌ యార్డుకు ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో పొగతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గ్రామానికి 50మీటర్ల దూరంలో బండమీద డంపింగ్‌ యార్డును ఏర్పాటుచేయడాన్ని ఆ సమయంలో స్థానికులు వ్యతిరేకించారు. వేసవికాలం అయినందున ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో ఈ ప్రాంతం మొత్తం పొగమయంగా మారింది. ఇళ్లలో ఉండే పరిస్థితి లేనందున ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఊరంతా పొగ కమ్ముకోవడంతో ప్రజలు వ్యవసాయ భూముల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొగ తగ్గిన తర్వాతే ఇళ్లకు వచ్చే పరిస్థితి ఉంది. నిబంధనలను విరుద్ధంగా గ్రామానికి ఆనుకుని డంపింగ్‌ యార్డు ఏర్పాటుచేయడంపై ఎనిమిదో వార్డు కౌన్సిలర్‌ సరిత ఆగ్రహం వ్యక్తం చేశారు.డంపింగ్‌ యార్డును వెంటనే తరలించాలని కోరారు.

గ డ్డివాము దగ్ధం

మద్దిరాల, జూన్‌ 2: మండల కేంద్రంలో గడ్డివాము దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల శివారులో వ్యవసాయ బావులు వద్ద కొంతమంది రైతులు శుక్రవారంవరి కొయ్యలను నిప్పు పెట్టారు. ఈ మంటలు ఉన్న వల్లపు రమేష్‌ గడ్డివాముకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని దగ్ధమైంది. ఈ మంటలు చుట్టుపక్కల 10ఎకరాలకు విస్తరించగా, రైతులు అప్రమత్తమై మంటలను ఆర్పడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో రమే్‌షకు చెందిన రూ.10వేల విలువైన 100 మోపుల గడ్డి దగ్ధమైంది.

Updated Date - 2023-06-03T01:23:04+05:30 IST