రాష్ట్ర ఏర్పాటుతో సబ్బండ వర్గాలు ఆర్థిక బలోపేతం

ABN , First Publish Date - 2023-06-03T01:03:14+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో సబ్బండ వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కిందని ప్రభుత్వవిప్‌ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు.

రాష్ట్ర ఏర్పాటుతో సబ్బండ వర్గాలు ఆర్థిక బలోపేతం
సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ సునీత

ఆత్మకూరు(ఎం), జూన్‌ 2: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో సబ్బండ వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కిందని ప్రభుత్వవిప్‌ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ రాక ముందు, కేసీఆర్‌ తొమ్మిదేళ్ల్ల పాలనలో ఎంత మార్పు వచ్చిందో ప్రజలు ఆలోచించాలని కోరారు. దేశంలోని 29 రాష్ట్రాలకు తెలంగాణ పథకాలు ఆదర్శంగా నిలిచాయన్నారు. తెలంగాణలో జీవనోపాధి లేక వలస వెళ్లిన కుటంబాలు కేసీఆర్‌ పాలనలో తిరిగి సొంత ఊర్లకు చేరుకొని ఊరి బలగంతో జీవిస్తున్నారని అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతును రాజును చేయాలన్నదే కేసీఆర్‌ లక్ష్యమని అన్నారు. తెలంగాణలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని, అందుకు ప్రజలంతా ఆయనకు అండగా ఉండాలని కోరారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కంచెర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 2018లో జరిగిన స్థానిక ఎన్నికల్లో మండల నాయకత్వం విభేదాలతో పార్టీకి తీవ్రం నష్టం వాటిల్లిందని అన్నారు. డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ చేపట్టిన సంక్షేమ పథకాలపై బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో మిగిలిన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల కార్యకర్తలతో చర్చించాలని కోరారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలను అరికట్టి, సకాలంలో ఎరువులు, విత్తనాలను అందిస్తున్న సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీని గ్రామాల్లో పటిష్టంగా నిర్మించాలని పార్టీ శ్రేణులను కోరారు. సమావేశానికి ముందు మండల కేంద్రంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్‌చార్జి యాదవరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్‌, ఆల్డా చైర్మన్‌ మోతె పిచ్చిరెడ్డి, పారీ మండల అధ్యక్షుడు బీసు చందర్‌, రైతు బంధు మండల కన్వీనర్‌ యాస ఇంద్రారెడ్డి, యాదగిరిగుట్ట జడ్పీటీసీ టి.అనురాధ, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు లగ్గాని రమేష్‌, గ్రామ శాఖ అధ్యక్షుడు కోరె వెంకన్న, నాయకులు పి.పూర్ణచందర్‌రాజు, కోరె బిక్షపతి, ఎంపీటీసీ వై. కవిత, బి.ఉప్పలయ్య, పి.వెంకటేశం, ఎస్‌.అరుణ, బి.దనలక్ష్మీ, వివిధ గ్రామాల బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T01:03:14+05:30 IST