ఓటు హక్కును వినియోగించుకోవాలి
ABN , First Publish Date - 2023-09-20T00:08:09+05:30 IST
ప్రతి ఒక్కరూ ఓటుహక్కు ను వినియోగించుకోవాలని, 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కు కోసం ఆనలైనలో నమో దు చేసుకోవాలని అదనపు కలెక్టర్ సీహెచ ప్రియాంక అన్నారు.

సూర్యాపేట(కలెక్టరేట్) / పెనపహాడ్, సెప్టెంబరు 19: ప్రతి ఒక్కరూ ఓటుహక్కు ను వినియోగించుకోవాలని, 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కు కోసం ఆనలైనలో నమో దు చేసుకోవాలని అదనపు కలెక్టర్ సీహెచ ప్రియాంక అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ముందు ఓటరు అవగాహన ర్యాలీని అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డితో కలసి జెండా ఊపి ప్రా రంభించి, మాట్లాడారు. ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా నిర్భయంగా ఓటు వేయాలన్నా రు. అనంతరం బైక్ ర్యాలీ ఖమ్మంక్రాస్ రోడ్డు, కొత్తబస్టాండ్ మీదుగా శంకర్ విలాస్, జూనియర్ కళాశాల మెడికల్‌కళాశాల వరకు నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్పీ నాగభూషణం, కలెక్టర్ ఏవో సుదర్శనరెడ్డి, సీపీవో వెంకటేశ్వర్లు, ఎంప్లాయిమెంట్ అధికారి మాధవరెడ్డి, డీఎ్‌ఫవో సతీ్‌షకుమార్, అగ్రికల్చరల్ అధికారి రామారావునాయక్, హర్టీకల్చర్ అధికారి శ్రీధర్, ఆర్డీవో వీరబ్రహ్మచారి, తహసీల్దార్ శ్యాంసుందర్‌రెడ్డి, రంగారావు, పరిశ్రమల అధికారి తిరుపతయ్య అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా పెనపహాడ్ మండల కేంద్రంలోని ఆరోగ్య మహిళా కేంద్రాన్ని అదనపు కలెక్టర్ ప్రియాంక తనిఖీ చేశారు. ఎంత మంది మహిళలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకున్నారని డాక్టర్ స్రవంతిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పీవో ఎంసీహెచ డాక్టర్ నాజీయా, మెడికల్ ఆఫీసర్ లింగమూర్తి, హెచసీవో చంద్రశేఖర్ రాజు, పీహెచసీ వైద్య సిబ్బంది, ఏఎనఎం లు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.