దారిపొడవునా దండాలు..
ABN , First Publish Date - 2023-03-19T00:17:55+05:30 IST
రెండు కిలోమీటర్లు.. ఎటు చూసినా జనం.. చేతుల్లో జాతీయ జెండాలు.. గొంతులతో ఆరాధనలతో లెఫ్టినెంట్ కల్నల్ ఉప్పల వినయ్‌భానురెడ్డి(37)(వీవీబీరెడ్డి)కి ప్రజలు కన్నీటివీడ్కోలు పలికారు.

బొమ్మలరామారం, మార్చి 18 : రెండు కిలోమీటర్లు.. ఎటు చూసినా జనం.. చేతుల్లో జాతీయ జెండాలు.. గొంతులతో ఆరాధనలతో లెఫ్టినెంట్ కల్నల్ ఉప్పల వినయ్‌భానురెడ్డి(37)(వీవీబీరెడ్డి)కి ప్రజలు కన్నీటివీడ్కోలు పలికారు. అరుణాచల్‌ప్రదేశ రాష్ట్రంలో చీతా హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన లెఫ్టినెంట్ వీవీబీరెడ్డి అంత్యక్రియలు స్వగ్రామం యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మలరామారంలో అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. ఆర్మీ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను పూర్తిచేశారు. జై జవాన, అమర్ రహే, భారతమాత ముద్దుబిడ్డ వీవీబీరెడ్డి అంటూ కన్నీటిపర్యంతమవుతూనే ప్రజల ఆయనకు వీడ్కోలు పలికారు. గ్రామం దుఃఖసాగరమైంది.
రెండు కిలోమీటర్లు... 600 బైక్‌లు
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా మల్కాజ్‌గిరిలోని దుర్గానగర్‌లోని ఇంటికి వీవీబీరెడ్డి పార్థివదేహాన్ని శుక్రవారంరా రాత్రి ఆర్మీ అధికారులు తీసుకువచ్చారు. శనివారం ఉదయం గవర్నర్ తమిళిసై పార్థివదేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరిన లెఫ్టినెంట్ కల్నల్ పార్థివదేహంతో కూడిన ఆర్మీ వాహనానికి జిల్లా సరిహద్దులోని రంగాపూర్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే సునీతామహేందర్‌రెడ్డి, ప్రజా ప్రతినిధులు ఎదురెళ్లారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన 600 మందికి పైగా యువకులు బైక్‌లతో ర్యాలీగా రెండు కిలోమీటర్ల దూరంలోని బొమ్మలరామారంగా ఆర్మీ వాహనం ముందు కదిలారు. కనుచూపు మేర జాతీయ జెండాల కనిపించడంతో పాటు జైజవాన నినాదాలు వినిపించాయి. వీవీబీరెడ్డి ఇంటి వద్ద గంట పాటు పార్థివదేహాన్ని ఉంచారు.
ఆర్మీ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
లెఫ్టినెంట్ వీవీబీరెడ్డి అంత్యక్రియలు ఆద్యంతం ఆర్మీ అధికార లాంఛనాలతో, అధికారుల కనుసన్నల్లో జరిగాయి. ఆర్మీ బ్యాండ్‌తో వీవీబీరెడ్డి అంతిమయాత్రకు ప్రారంభం కాగా, భార్య స్పందనారెడ్డి భర్త ఫొటోతో ముందు నడిచారు. వ్యవసాయ క్షేత్రానికి చేరుకునే వరకూ గ్రామంలో జైజవాన నినాదాలు హోరెత్తాయి. భారత సైనిక దళం మద్రాస్ లెఫ్ట్‌నెంట్ రెజిమెంట్ అమితషా ఆధ్వర్యంలో ఆర్మీ సిబ్బంది గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి సైనిక గౌరవ వందనం సమర్పించారు.
ఇదిగో మీ వారి జ్ఞాపకం.. దేశ గౌరవం
చితిపై వీవీబీరెడ్డి పార్థివదేహాన్ని ఉంచిన తర్వాత అతడి పై కప్పిన జాతీయ జెండాను, ఆర్మీ దుస్తులను అధికారులు వీవీబీరెడ్డి భార్య స్పందనారెడ్డికి అందజేశారు. ‘ఇవి మీ వారి జ్ఞాపకాలు, దేశానికి ఆయన ఓ గౌరవం’ అనేలా అధికారులు అప్పగించారు. ఈ సమయంలో స్పందనా పార్థివదేహంపై పడి రోదించడంతో అక్కడున్న వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు.
హాజరైన నేతలు
లెఫ్టినెంట్ కల్నల్ అంత్యక్రియలకు మంత్రి, ఎమ్మెల్యేలతో పాటు జిల్లా పరిషత చైర్మన ఎలిమినేటి సందీ్‌పరెడ్డి, డీసీపీ రాజే్‌షచంద్ర, ఏసీపీవెంకట్‌రెడ్డి, ఆర్డీవో భూపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు బూడిద భిక్షమయ్యగౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు సూదగాని హరిశంకర్‌గౌడ్‌లు హాజరయ్యారు. వీవీబీరెడ్డి పార్థివదేహంపై పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులర్పించి అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
ప్రముఖుల నివాళులు
వీవీబీరెడ్డి పార్థివదేహాన్ని సందర్శించి, ప్రముఖులు నివాళులర్పించారు. మంత్రి జగదీ్‌షరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు సునీతామహేందర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్యతో పాటు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, జిల్లా కలెక్టర్ పమేలా సత్ఫథి, రాచకొండ పోలీస్ కమిషనర్ దేవంద్రసింగ్ చౌహానతో పాటు ఆర్మీ అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీవీబీరెడ్డి తండ్రి నర్సింహారెడ్డి, తల్లి విజయలక్ష్మీ, భార్య స్పందననారెడ్డి, కుమార్తెలు అనికరెడ్డి, హర్వికారెడ్డిలను చూసి కలెక్టర్‌తో పాటు అక్కడున్న వారిని కంటతడి పెట్టారు.