బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత

ABN , First Publish Date - 2023-07-01T00:49:29+05:30 IST

సమాజంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రతీ ఒక్కరి బాధ్యతని ఎస్పీ కె.అపూర్వరావు అన్నారు. ఈనెల 1వ తేదీ నుం చి నెల రోజుల పాటు నిర్వహించనున్న ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమంపై శిశు సంక్షేమశాఖ అధికారులతో కలిసి జిల్లా పోలీ స్‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత

ఎస్పీ అపూర్వరావు

నల్లగొండ టౌన్‌, జూన్‌ 30: సమాజంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రతీ ఒక్కరి బాధ్యతని ఎస్పీ కె.అపూర్వరావు అన్నారు. ఈనెల 1వ తేదీ నుం చి నెల రోజుల పాటు నిర్వహించనున్న ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమంపై శిశు సంక్షేమశాఖ అధికారులతో కలిసి జిల్లా పోలీ స్‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నిరాదరణకు గురైన, తప్పిపోయిన, వెట్టిచాకిరీకి గురవుతున్న బాల, బాలికలను గుర్తించి వారిని సంరక్షించేందుకు ఏటా ఆపరేషన్‌ ముస్కాన్‌, ఆపరేషన్‌ స్మైల్‌ నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని మూడు సబ్‌ డివిజన్లలో పోలీస్‌, లేబర్‌, చైల్డ్‌కేర్‌, రెవెన్యూ, హెల్త్‌, ఐసీడీఎస్‌, శిశు సంక్షేమశాఖ అధికారుల బృందాలు బాల, బాలికలను గుర్తిస్తాయన్నారు. పరిశ్రమలు, బ్రిక్స్‌ తయారీ, హోటళ్లు, లాడ్జీలు, మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు, దుకాణాలు, దాబాలు ఎక్కడైనా పిల్లలు వెట్టిచాకిరీకి గురవుతే అలాంటి వారిని గుర్తించి యజమాన్యాలపై కేసు లు నమోదు చేస్తామన్నారు. అలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే చైల్డ్‌కేర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. పిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ ఇచ్చి అప్పగించడం లేదా, స్టేట్‌ హోంకు తరలిస్తామన్నా రు. వీధి బాలలు కన్పిస్తే 1098 లేదా డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చి న వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. సమావేశంలో డీడబ్ల్యూవో కృష్ణవేణి, డీసీపీవో గణేష్‌, సీడబ్ల్యూసీ చైర్మన్‌ కృష్ణ, ఆంజనేయులు, ఏహెచ్‌టీయూ ఎస్‌ఐ గోపాల్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-01T00:49:29+05:30 IST