దొడ్డా నర్సయ్య నేటి యువతకు ఆదర్శం

ABN , First Publish Date - 2023-01-18T00:00:56+05:30 IST

తెలంగాణ సాయుధ పోరాటయోధుడు, హుజూర్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే దొడ్డా నర్సయ్య నేటి తరం యువకులకు ఆదర్శప్రాయుడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనే ని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకట్‌రె డ్డి,ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు.

దొడ్డా నర్సయ్య నేటి యువతకు ఆదర్శం
చిలుకూరులో సీపీఐ ర్యాలీలో పాల్గొన్న కూనంనేని, పల్లా

చిలుకూరు, జనవరి 17 : తెలంగాణ సాయుధ పోరాటయోధుడు, హుజూర్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే దొడ్డా నర్సయ్య నేటి తరం యువకులకు ఆదర్శప్రాయుడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనే ని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకట్‌రె డ్డి,ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు.చిలుకూరులో మం గళవారం దొడ్డా నర్సయ్య 24వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వారు మాట్లాడారు. తెలంగాణ సాయుధపోరాటంలో పాల్గొని నిజాం నవాబుకు, రజాకార్లకూ,జమీందార్‌, గడీలకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు దొడ్డా నర్సయ్య అన్నారు. కాగా గ్రామంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన అమరవీరుల పతాకాలను నాయకులు స్వీకరించా రు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గసభ్యుడు గన్నా చంద్రశేఖర్‌, సీనియర్‌ నాయకులు దొడ్డా నారాయణరావు, జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, రాష్ట్ర మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఉస్తెల సృజన, ప్రజా నాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు పల్లె నర్సింహ, నా యకులు యల్లావుల రాములు, మేకల శ్రీనివాస్‌, కృష్ణారెడ్డి, ఎస్‌కే లతీఫ్‌, ధనుంజయనాయుడు, ఉస్తెల నారాయణరెడ్డి, కంబాల శ్రీ నివాస్‌, పాలకూరి బాబు, పోకల వెంకటేశ్వర్లు, మల్లేశ్వరీ, దొడ్డా వెంకటయ్య, ఎం.లక్ష్మయ్య, కొండా కోటయ్య, రాజు, సిహెచ.కొండలు, సాహెబ్‌ అలీ, ఆంజనేయులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-18T00:00:59+05:30 IST