బీఆర్‌ఎస్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి
ABN , First Publish Date - 2023-03-19T00:15:45+05:30 IST
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే గ్రామాలు అబివృద్ధి చెందాయని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ అన్నారు.

తిరుమలగిరి, మార్చి 18: బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే గ్రామాలు అబివృద్ధి చెందాయని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ అన్నారు. మండలంలోని తొండ సర్పంచ్ నెమురు గొమ్ముల శాతవాహనరావు, తన అనుచరులతో కలిసి శనివారం తిరుమలగి రిలోని ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. గృహ, వ్యవసా యానికి 24గంటల కరెంటు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. డంపింగ్‌యార్డులు, శ్మశానవాటికలు, పల్లె పకృతివనాలు, ఇంటింటికీ భగీరథ నీరు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. నీళ్లు లేక ఒట్టిపోయిన నేలల్లో కాళేశ్వరం జలాలతో సస్యశ్యామం చేసి, రైతుల కళ్లలో ఆనందం చూస్తున్నామన్నారు. పల్లెల్లో సీసీరోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలతో అభివృద్ధి కనబడుతోం దన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ గుజ్జ దీపికాయుగందర్‌రావు, ఎంపీపీ నెమురుగొమ్ముల స్నేహలత, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సంకెపల్లి రఘునందన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్, ఉప సర్పంచ్ వెంకన్న, రామారావు, రామాంజనేయులు, కొమొరెల్లి రజిత లింగయ్య, ఉపేంద్ర చంద్రు, ఎల్లయ్య, సాయిమల్లు, లోడె సాయి, వెంకన్న పాల్గొన్నారు.