మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ ధ్వంసం

ABN , First Publish Date - 2023-03-02T01:21:44+05:30 IST

పట్టణ పరిధిలోని రామగిరి వద్ద కోదాడ – మిర్యాలగూడ ప్రధాన రహదారి వెంట ఉన్న మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ బుధవారం ధ్వంసమైంది.

 మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ ధ్వంసం

నేరేడుచర్ల, మార్చి 1: పట్టణ పరిధిలోని రామగిరి వద్ద కోదాడ – మిర్యాలగూడ ప్రధాన రహదారి వెంట ఉన్న మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ బుధవారం ధ్వంసమైంది. దీంతో నీరంతా భారీ వరదలా ప్రధాన రహదారిపై ప్రవహించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. నీటి ప్రవాహ ఉధృకి ఒక వైపు రోడ్డు కోతకు గురైంది. రెండు గంటల పాటు నీరు రహదారిపై ప్రవహించింది. పైప్‌లైన్‌ ధ్వంసంమైన విషయాన్ని తెలుసుకున్న సిబ్బంది ఆ ప్రాంతానికి వచ్చి నీటిని నిలిపివేవారు. రామగిరి నుంచి పైప్‌లైన్‌ నర్సయ్యగూడెనికి మళ్లించామని, బెండు ఉన్న చోట గ్యాస్‌ కట్‌ సరిగా వేయనందున నీరు లీకేజీ అయిఉంటుందని భావిస్తున్నమని మిషన్‌ భగీరథ ఇన్‌చార్జి రాము తెలిపారు.వెంటనే మరమ్మతు చేయిస్తామన్నారు.

Updated Date - 2023-03-02T01:21:44+05:30 IST