రాష్ట్రానికి ఏం చేశారని దశాబ్ది ఉత్సవాలు

ABN , First Publish Date - 2023-06-03T01:28:00+05:30 IST

తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారని సీఎం కేసీఆర్‌ దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు ప్రశ్నించారు.

రాష్ట్రానికి ఏం చేశారని దశాబ్ది ఉత్సవాలు
సమావేశంలో మాట్లాడుతున్న సంకినేని వెంకటేశ్వర్‌రావు

సూర్యాపేట సిటీ, జూన 2: తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారని సీఎం కేసీఆర్‌ దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు ప్రశ్నించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చినందుకు ప్రజలందరూ సంతోషం గా ఉన్నా, తొమ్మిదేళ్లుగా రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీగా ఉన్నందుకు బాధపడుతున్నారని అన్నారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత దృష్ట్యా తెలంగాణ వాదాన్ని అడ్డుపెట్టుకుని సీఎం కేసీఆర్‌ మరోమారు అధికారంలోకి రావాలని చూస్తున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎ్‌సగా మార్చినప్పుడే తెలంగాణ అనే పదాన్ని ఉపయోగించే నైతిక హక్కును కేసీఆర్‌ కొల్పోయారన్నారు. ఆనాడు తెలంగాణ బిల్లుకు రాజ్యసభలో బీజేపీ మద్దతు తెలిపిందన్నారు. అనంతరం తెలంగాణ ఉద్యమం సందర్భంలో జైలు జీవితం గడిపిన చల్లమల్ల నరసింహారావు, కట్ల సైదులుగౌడ్‌, తోట లక్ష్మీనారాయణ, సుభా ష్‌ను సంకినేని సన్మానించారు. ముందుగా తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. సమావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గజ్జల వెంకటరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎండీ అబీద్‌, కర్నాటి కిషన, వల్థాస్‌ ఉపేందర్‌, సంధ్యాల సైదులు, పందిరి రాంరెడ్డి, పోకల రాములు, శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T01:28:00+05:30 IST