స్వాతంత్య్ర సమరయోధురాలి మృతి
ABN , First Publish Date - 2023-09-22T00:43:23+05:30 IST
స్వాతంత్య్ర సమరయోధురాలు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంగరి గోవర్ధన మాతృమూర్తి ప్రమీలమ్మ(95) గురువారం మృతి చెందారు.
తుంగతుర్తి, సెప్టెంబరు 21: స్వాతంత్య్ర సమరయోధురాలు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంగరి గోవర్ధన మాతృమూర్తి ప్రమీలమ్మ(95) గురువారం మృతి చెందారు. ఆమె మృతదేహంపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన మందుల సామేలు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇనచార్జి గుడిపాటి నరసయ్య, తెలంగాణ ఉద్యమకారులు కృష్ణమూర్తి, దేవేందర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.