Share News

గుట్టలో భక్తుల కోలాహలం

ABN , First Publish Date - 2023-12-11T00:26:21+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం కోలాహలం నెలకొంది.

గుట్టలో భక్తుల కోలాహలం
ఆలయ తిరువీధుల్లో భక్తుల సందడి

ధర్మ దర్శనానికి ఐదు గంటల సమయం

స్వామివారిని దర్శించుకున్న 60వేల మంది భక్తులు

యాదగిరిగుట్ట, డిసెంబరు 10: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం కోలాహలం నెలకొంది. వరు స సెలవులు, కార్తీక మాసం ముగుస్తుండడంతో రాష్ట్ర నలుమూలల నుం చే కాకుండా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి నృ సింహుడిని దర్శించుకున్నారు. దీంతో ఉభయ దర్శన క్యూలైన్లు, ఆలయ పరిసరాలు, బస్‌బే, కొండకింద బస్‌స్టాండ్‌ తదితర ప్రాంతాలు భక్తుల సం చారంతో సందడిగా కనిపించాయి. పట్టణ ప్రధాన రహదారులు, ఘాట్‌రో డ్‌, పార్కింగ్‌ ప్రాంతాలు భక్తుల వాహనాలతో కిక్కిరిసిపోయాయి. స్వామివారి ధర్మ దర్శనానికి ఐదు గంటలు, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. సుమారు 60వేలకు పైగా భక్తులు ఇష్టదైవాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్టు దేవస్థాన అధికారులు తెలిపారు.మధ్యాహ్నం కొండపైనపార్కింగ్‌ సరిపోకపోవడంతో భక్తు ల వాహనాల గంటసేపు అధికారులు నిలిపివేశారు.రద్దీ తగ్గిన తర్వాత తిరి గి వాహనాలను కొండపైకి అనుమతించారు.ఆర్టీసీ బస్సుల్లో కిక్కిరిసి అధిక సంఖ్యలో తరవెళ్లాల్సిరావడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. బస్సుల కోసం గంటల తరబడి నిలబడాల్సి వచ్చిందని భక్తులు వాపోయారు.

శాస్త్రోక్తంగా స్వాతి జన్మనక్షత్ర పూజలు

కార్తీక మాసం సందర్భంగా భక్తులు కుటుంబసమేతంగా సత్యనారాయణస్వామి వ్రతపూజలు, హరిహరుల ఆలయాల ఆవరణలో కార్తీక దీపారాధనలు చేపట్టి మొక్కులు చెల్లించుకున్నారు. . ఒక్కరోజే 1,594 మంది దంపతులు సత్యనారాయణస్వామి వ్రతపూజల్లో పాల్గొన్నారు. స్వామి జన్మనక్షత్రం పురస్కరించుకుని స్వాతి జన్మనక్షత్రోత్సవాలు పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో వైభవంగా కొనసాగాయి. ప్రభాతవేళ స్వయంభువులను సుప్రభాతంతో మేల్కొలిపిన ఆచార్యులు ముఖమండపంలో 108 కలశాలను ఏర్పాటు చేశారు. హోమ పూజ లు చేపట్టి గర్భాలయంలో కొలువుదీరిన మూలవర్యులను వేదమంత్ర పఠనాలు, మంగళవాయిద్యాల నడుమ అష్టోత్తర శత కలశాలతో అభిషేకించా రు. 108 బంగారు పుష్పాలతో స్వామిని అర్చించిన పూజారులు యాదగిరిక్షేత్రమహత్యాన్ని భక్తులకు వివరించారు. కొండచుట్టూ భక్తులు, స్థానికులు, భక్తిభజన మండలి బృందం, అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో గిరిప్రదక్షణ లు చేపట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ప్రాకార మండపంలో లక్ష్మీనృసింహుల తిరుకల్యాణోత్సవం ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. యాదగిరీశుడిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రరవాణ,సమాచారశాఖ మం త్రివిశ్వరూప్‌ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కుటుంబసభ్యులతో కలిసి ఆల య ఆవరణలో కార్తీక దీపారాధనలు చేపట్టి మొక్కులు చెల్లించుకున్నారు.

వేధిస్తున్న పార్కింగ్‌ సమస్య

యాదగిరికొండపైన సరైన పార్కింగ్‌ ప్రదేశాలు లేక రద్దీ, విశేష రోజు ల్లో అధికారులను ఈ సమస్య వేధిస్తోంది. ఆలయ పునర్నిర్మాణ సమయం లో పార్కింగ్‌కు ఏర్పాట్లు చేపట్టకపోడమే ఈ సమస్యకు ప్రధాన కారణమ ని తెలుస్తోంది. మామూలు రోజుల్లో వెయ్యిలోపు సెలవు, విశేష రోజుల్లో ఈ సంఖ్య దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేలకు వాహనాల సంఖ్య చేరుతుండం విశేషం.

కొండపైనబస్‌బే,మొదటి ఘాట్‌రోడ్‌తో పాటు పడమటి దిశలోని పార్కిం గ్‌ ప్రాంతంలో భక్తుల వాహనాలను అధికారులు పార్కింగ్‌ చేయిస్తున్నారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో వాహనాల్లో తరలివస్తుండడంతో ఈ సమస్య మరింత జఠిలంగా మారుతోంది. ఈక్రమంలో అధికారులు కొంతసేపు కొం డపైకి వాహనాలను అనుమతించకుండా కొండకిందే నిలిపి వేస్తున్నారు. కొండపైనుంచి వాహనాలను వెళ్లిన తర్వాత తిరిగి భక్తుల వాహనాలను కొండపైకి అనుమతిస్తున్నారు. దేవస్థాన అధికారులు కొండపైన వాహనాల పార్కింగ్‌ కోసం శాశ్విత ఏర్పాట్లు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

స్వామివారి నిత్యాదాయం రూ.1.09కోట్లు

యాదగిరీశుడి ఆలయ ఖజానాకు ఆదివా రం రూ.1.09కోట్లు ఆదాయం సమకూరింది. కార్తీక మాసం ముగుస్తుండడం, వరుస సెలవు లు రావడంతో ఇష్టదైవాల దర్శనాలు, ఆర్జిత సే వోత్సవాల్లో కుటుంబసమేతంగా పాల్గొని మొ క్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్య లో యాదగిరిగుట్ట క్షేత్రానికి వచ్చారు. రెండు దఫాలుగా కొనసాగిన వీఐపీ బ్రేక్‌ దర్శనాల ద్వారా రూ.10. 85లక్షలు, ప్రధానబుకింగ్‌ ద్వారా రూ.5.20లక్షలు, వీఐపీ దర్శనాల ద్వారా రూ.23. 85లక్షలు, వాహన ప్రవేశంద్వారా రూ.8 క్షలు, వ్రత పూజల ద్వా రా రూ.12.46లక్షలు, ప్రసాదా ల విక్రయం ద్వారా రూ.34.31లక్షలు రాగా మిగిలినవి ఇతర విభాగాల నుంచి ఆల య ఖజానాలో జమ అయినట్లు అధికారులు తెలిపారు.

బస్సుల కోసం భక్తుల పాట్లు

యాదగిరికొండకు కొండంత ఆశతో విచ్చేసే భక్తులకు ఏళ్లు గడుస్తున్నా బస్సుల కోసం నిరీక్షించే బాధలు తప్పడంలేదు. క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులకు స్వయంభువుల దర్శనాలకు కొండపైకి వెళ్లేందు కు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో చేరవేస్తుంది. భక్తజనులు అధిక సంఖ్య లో తరలిరావచ్చిన ప్రతిసారీ ఆర్టీసీ బస్సులు సరిపోకపోవడంతో ఇ బ్బందులకు గురవుతున్నారు. బస్సుల కోసం భక్తులు గంటల తరబడి వేచివుండాల్సి వస్తోందని, ఉన్న బస్సుల్లో ఫుట్‌బోర్డు పైనా కిక్కిరిసిగా నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తోందని భక్తులు వాపోతున్నారు. రద్దీ సమయంలో ఎక్కువ బస్సులను నడపాలని, కోరుతున్నారు.

Updated Date - 2023-12-11T00:27:58+05:30 IST