సీసీ కెమెరాలతో నేరాలకు అడ్డుకట్ట
ABN , First Publish Date - 2023-03-02T01:02:47+05:30 IST
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు, అసాంఘీక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చని పారిశ్రామిక వేత్త, బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు వింజం రాజేంద్రప్రసాద్ అన్నారు.
మిర్యాలగూడ రూరల్, మార్చి 1: సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు, అసాంఘీక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చని పారిశ్రామిక వేత్త, బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు వింజం రాజేంద్రప్రసాద్ అన్నారు. ‘సామాజిక భద్రత’ అనే అంశంపై వివిధ కంపెనీలకు చెందిన పారిశ్రామిక వేత్తలతో జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నేరాలను అదుపు చేసేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్న జిల్లా పోలీసుల కృషి అభినందనీయమన్నారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా దొంగతనాలు, ఇతర నేరాలకు సంబంధించిన నిందితులను వెంటనే గుర్తించవచ్చన్నారు. నేరాలను నియంత్రించడంలో, ప్రజలకు ప్రశాంత వాతావరణాన్ని అందించేందుకు సీసీ కెమెరాలు దోహదపడుతాయన్నారు. అనంతరం సీసీ కెమెరాల ఏర్పాటుకు రాజేంద్రప్రసాద్ ఎస్పీ కె.అపూర్వరావుకు రూ.లక్ష చెక్కు అందచేశారు. ఈ సందర్భంగా వింజం రాజేంద్రప్రసాద్‌ను ఎస్పీ అపూర్వరావు అభినందించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి, సీఐ రాఘవేందర్, వన్‌టౌన్ ఎస్‌ఐ సుధీర్‌బాబు, రూరల్ ఎస్‌ఐ డి.నరసింహులు, వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్‌ఐ సంతోష్, పారిశ్రామిక వేత్తలు రాజ్‌కుమార్, శ్రీనివాస్, వెంకటరమణ, లక్ష్మయ్య, ఏకె.సింగ్, సుధీర్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, మధుకుమార్ పాల్గొన్నారు.