17నుంచి సీపీఎం జన చైతన్య యాత్రలు
ABN , First Publish Date - 2023-03-05T00:54:28+05:30 IST
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విదానాలపై ఈ నెల 17 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎం ఆధ్వర్యంలో జన చైతన్య యాత్రలను నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు వెల్లడించారు.
పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు
చౌటుప్పల్ టౌన్, మార్చి 4: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విదానాలపై ఈ నెల 17 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎం ఆధ్వర్యంలో జన చైతన్య యాత్రలను నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు వెల్లడించారు. చౌటుప్పల్ పట్టణంలోని కందాళ రంగారెడ్డి భవన్‌లో శనివారం పట్టణ సీపీఎం సమావేశం కార్యదర్శి బండారు నర్సింహ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సీతారాములు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే జన చైత న్య యాత్రల్లో ఈ నెల 17నుంచి మూడు ప్రాంతాల నుంచి మూడు జాతలు బయలుదేరుతాయని, ఈ నెల 29వ తేదీన హైదరాబాద్‌లో ముగింపు సభ ను నిర్వహిస్తామని ఆయన వివరించారు. సామాన్య ప్రజలపై కేంద్ర ప్రభుత్వం భారాన్ని మోపడమే ఒక పనిగా పెటుకుందని, వంటగ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచేసిందని ఆయన ఆరోపించారు. దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిని పొందేందుకు బీజేపీ ప్రభుత్వాలు రకరకాల కుట్రలను సాగిస్తున్నాయని, దేశంలోని లౌకికవాద శక్తులు ఏకమై మతోన్మాదాన్ని తిప్పికొట్టవలసిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, అవ్వారు రామేశ్వరి, మునిసిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, నాయకులు గోశిక కరుణాకర్, సప్పిడి శ్రీనివా్‌సరెడ్డి, బత్తుల దాసు, దేప రాజు, కామిశెట్టి ప్రభాకర్, వి.శ్రీనివాస్, చీకూరి ఈదయ్య, నెల్లికంటి నర్సింహ, బొబ్బ రాజు, మెగుదాల రాములు పాల్గొన్నారు.