నకిలీ విత్తనాలను అరికట్టాలి

ABN , First Publish Date - 2023-06-01T01:08:56+05:30 IST

నకిలీ విత్తనాలను అరికట్టాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి వ్యవసాయ అధికారులను డిమాండ్‌ చేశారు.

 నకిలీ విత్తనాలను అరికట్టాలి
సమావేశంలో మాట్లాడుతున్న రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి

రామన్నపేట, మే 31: నకిలీ విత్తనాలను అరికట్టాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి వ్యవసాయ అధికారులను డిమాండ్‌ చేశారు. సీపీఎం మండల కార్యాలయంలో జరిగిన రైతు సంఘం సమావేశంలో మాట్లాడుతూ నకీలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వ్యవసాయ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో విచ్చలవిడిగా నకిలీ విత్తనాల వినియోగం పెరుగుతోందన్నారు. వ్యవసాయ అధికారులు సిఫారస్‌ చేసినవి కాకుండా డీలర్లు హైబ్రిడ్‌ విత్త్తనాలు అసలు ధరకన్నా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం అయినా విత్తనాలు సరఫరా చేయడంలేదన్నారు. కార్యక్రమంలో వ్యకాస జిల్లా ఉపాధ్యక్షుడు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, రైతు సంఘం మండల కార్యదర్శి బోయిని ఆనంద్‌, అధ్యక్షుడు గన్నెబోయిన విజయభాస్కర్‌, గాదె నరేందర్‌, బల్గూరి అంజయ్య, వైస్‌ ఎంపీపీ నాగటి ఉపేందర్‌, కందుల హనుమంతు, వేముల సైదులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-01T01:11:28+05:30 IST