విజయభేరి సభకు తరలిన కాంగ్రెస్ శ్రేణులు
ABN , First Publish Date - 2023-09-18T00:47:22+05:30 IST
: హైదరాబాద్‌లోని తుక్కుగూడ ఆదివారం జరిగిన విజయభేరి సభకు కాంగ్రెస్ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా ఆదివారం భారీగా తరలివెళ్లాయి.

భువనగిరి రూరల్, భూదాన్‌పోచంపల్లి, వలిగొండ, బీబీనగర్, యాదగిరిగుట్ట రూరల్, రామన్నపేట, గుండాల, మోత్కూరు, సెప్టెంబరు 17: హైదరాబాద్‌లోని తుక్కుగూడ ఆదివారం జరిగిన విజయభేరి సభకు కాంగ్రెస్ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా ఆదివారం భారీగా తరలివెళ్లాయి. భువనగిరి నియోజకవర్గం నుంచి భారీగా తరలినట్లు నియోజకవర్గ నేత పచ్చిమట్ల శివరాజ్‌గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో పోత్నక్ ప్రమోద్ కుమార్, పంజాల రామాంజనేయు లుగౌడ్, బర్రె జహాంగీర్, ఎలిమినేటి కృష్ణారెడ్డి ఉన్నారు. భూదాన్‌పోచంపల్లి నుంచి కార్యకర్తలు, నాయకులు భారీగా తరలి వెళ్లారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తడక వెంకటేష్, నాయకులు పాక మల్లేశంయాదవ్, భారత లవకుమార్, మర్రి నర్సింహారెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సామ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. వలి గొండ నుంచి తరలి వెళ్లిన వారిలో జడ్పీటీసీ వాకిటి పద్మా అనంతరెడ్డి, నాయకులు కందాల రామకృష్ణారెడ్డి, పబ్బు శ్రీనివాస్, తుమ్మల యుగేందర్‌రెడ్డి, కసుబ శ్రీనివాస్, వెంకటేశం, రమేష్ ఉన్నారు. బీబీనగర్ మంండలం నుంచి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి పంజాల రామాంజనేయులుగౌడ్ ఆధ్వర్యంలో వందలాది మంది వివిధ వాహనాల్లో తరలి వెళ్లారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో వందలాది వాహనాల్లో యాదగిరి గుట్ట నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. కార్యక్రమంలో నాయకులు గుడిపాటి మధుసూదన్‌రెడ్డి, గిరిగౌడ్, కానుగు బాలరాజ్‌గౌడ్, ఎంపీపీ చీర శ్రీశైలం, గుండ్లపల్లి భరత్‌గౌడ్, ముక్కెర్ల మల్లేశ్ యాదవ్, బిక్షపతిగౌడ్, ముత్యాలు, వల్లపు రమేష్ పాల్గొన్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య ఆధ్వర్యంలో రామన్నపేట నుంచి హైదరాబాద్‌కు తరలి వెళ్లారు. మోత్కూ రు నుంచి వెళ్లినవారిలో నాయకులు వంగాల సత్యనారాయణ, గుండగోని రామచంద్రు, పైళ్ల సోమిరెడ్డి, అవిశెట్టి అవిలిమల్లు, అంతటి నర్స య్య, పైళ్ల నర్సిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కారుపోతుల శ్రీనివాస్ ఉన్నారు. గుండాల, అడ్డగూడూరు మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు.