వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
ABN , First Publish Date - 2023-03-02T00:48:31+05:30 IST
వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇనచార్జి మాణిక్‌రావుఠాక్రే అన్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో చేపట్టే హాత సే హాత జోడోయాత్రను సూర్యాపేట జిల్లా కోదాడలో బుధవారం ప్రారంభించి, ఆయన పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇనచార్జి మాణిక్‌రావుఠాక్రే
కోదాడలో హోత సే హాత జోడోయాత్రను ప్రారంభించిన ఠాక్రే
కోదాడ, మార్చి 1 : వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇనచార్జి మాణిక్‌రావుఠాక్రే అన్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో చేపట్టే హాత సే హాత జోడోయాత్రను సూర్యాపేట జిల్లా కోదాడలో బుధవారం ప్రారంభించి, ఆయన పాల్గొన్నారు. సాయంత్రం ఆరు గంటలకు మేళ్లచెర్వు, కాశీనాథం ఫంక్షనహాల్ నుంచి మొదలైన పాదయాత్ర రంగా థియేటర్ చౌరస్తా మీదుగా మార్కెట్ యార్డు వరకు సాగింది. అక్కడి నుంచి 29, 33, 34, 35 వార్డుల్లో పాదయాత్ర కొనసాగింది. మొదటి రోజు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర పాదయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ కరపత్రాలను, డోర్‌స్టిక్కర్లను అందజేసి, స్థానికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాణిక్‌రావుఠాక్రేకు కాలనీవాసులు స్థానికులు హారతులు ఇస్తూ, పూలదండలతో స్వాగతం పలికారు. అనంతరం ముగింపు సభలో ఆయన మాణిక్‌రావు ఠాక్రే మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్ఠిగా పనిచేసి, పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. విభేదాలు వీడి పార్టీని ముందుకు తీసుకు వెళ్లాలన్నారు. బీఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక పాలనను ప్రజల ముగింటకు తెచ్చేందుకు జోడోయాత్ర దోహదం చేస్తుందన్నారు. ఆ దిశగా కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని సూచించారు. ఎంపీ ఎన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాలతో పాటు మిగతా నియోజకవర్గాలలో వచ్చే ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచేందుకు కృషి చేస్తానని అన్నారు. బీఆర్‌ఎ్‌సపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను కార్యకర్తలు, నాయకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు వంగవీటి రామారావు, గంధం పాండు, డేగ శ్రీధర్, చెవిటి వెంకన్న నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలు అధైర్యపడొద్దు : మాజీ మంత్రి జానారెడ్డి
హుజూర్‌నగర్ : కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధైర్యపడొద్దని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని కాంగ్రెస్ నాయకులు సాముల శివారెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎ్‌సకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మె స్థితిలో లేరన్నారు. సమావేశంలో సిద్ధార్థరెడ్డి, బెంజిమెన్, గల్లా వెంకటేశ్వర్లు, సుదర్శన్, సుబ్బారాజు, రామరాజు, సైదులు, రజాక్, రాము, మట్టయ్యగౌడ్, ముత్తయ్య, సైదులు, సత్యనారాయణ పాల్గొన్నారు.