యాదగిరికొండపై భక్తుల కోలాహలం

ABN , First Publish Date - 2023-06-26T00:43:57+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది.

యాదగిరికొండపై భక్తుల కోలాహలం
నిత్యతిరుకల్యాణోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు

నృసింహుడి దర్శనానికి నాలుగు గంటలు

35వేల మంది భక్తుల రాక

నిత్యాదాయం రూ.46.93లక్షలు

యాదగిరిగుట్ట, జూన్‌ 25: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. వారాంతపు సెలవు రోజు కావడంతో ఇష్టదైవాలను దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. కొండకింద లక్ష్మీఫుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి కొండపైకి చేరుకొని దర్శనం కోసం ఉభయ దర్శన క్యూలైన్లలో బారులు తీరారు. ధర్మదర్శనాలకు నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనాలకు రెండు గంటల సమ యం పట్టిందని భక్తులు తెలిపారు. సుమారు 35వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించకున్నట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో పట్టణంలో, ఆలయ ఘాట్‌రోడ్‌ ప్రాంతాలు వాహనాలతో రద్దీ వాతావరణం నెలకొంది. ప్రధానాలయం, ప్రసాదాల విక్రయశాల, ఆలయ తిరువీధులు భక్తుల సంచారంతో సందడిగా కన్పిం చాయి. స్వయంభూ పాంచనారసింహుడికి నిత్య పూజలు సంప్రదా యరీతిలో కొనసాగాయి. వేకువజామున సుప్రభాతంతో నిత్యారాధనలు ఆరంభించిన ఆచార్యులు రాత్రి వేళ మహానివేదన, శయనోత్సవ పర్వాలతో ఆలయ ద్వారబంధనం చేశారు. గర్భాలయంలోని స్వయంభువులకు అభి షేకం, అర్చనలు, మొదటి ప్రాకార మండపంలో హోమం, నిత్య తిరుకల్యాణోత్పవ పర్వాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. కొండపైన శివా లయంలో రామలింగేశ్వరుడికి నిత్య పూజలు, నిత్య రుద్రహవనం, కొండకింద వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రతపూజలు శైవాగమ పద్ధతిలో కొనసాగాయి. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.46,93,411 ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు.

Updated Date - 2023-06-26T00:43:57+05:30 IST