రూ.34 వేల కోట్లతో సమగ్రాభివృద్ధి

ABN , First Publish Date - 2023-06-03T00:27:03+05:30 IST

తెలంగాణ రాష్ట్రం సిద్ధించి గడిచి న తొమ్మిదేళ్లలో రూ.34 వేల కోట్లతో జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేశామని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు.

రూ.34 వేల కోట్లతో సమగ్రాభివృద్ధి
దశాబ్ది వేడుకల్లో మాట్లాడుతున్న మంత్రి జగదీష్‌రెడ్డి

వ్యవసాయ రంగానికి పెద్దపీట

విద్యుత రంగంలో సంచలన విజయాలు

విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు

దశాబ్ది వేడుకల్లో మంత్రి జగదీ్‌షరెడ్డి

సూర్యాపేటటౌన, జూన్‌ 2 : తెలంగాణ రాష్ట్రం సిద్ధించి గడిచి న తొమ్మిదేళ్లలో రూ.34 వేల కోట్లతో జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేశామని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించిన రాష్ట్ర దశాబ్ది వేడుకలకు ముఖ్యఅతిథిగా మంత్రి హాజరై, మాట్లాడారు. విద్యుత రంగంలో సీఎం కేసీఆర్‌ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాలతో దేశానికి తెలంగాణ రాష్ట్రం రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు. వ్యవసాయ రం గానికి, వాటి అనుబంధ విభాగాలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర జీడిపీ వృద్ధి రేటు 13.02 శాతానికి పెరిగిందన్నారు. ఇదే సమయంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 10.02 శాతానికి తగ్గిందని గుర్తుచేశారు. 2017-18 నుంచి 2021-22 సంవత్సరాల మధ్య కాలాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధిక తలసరి ఆదాయ వృద్ధి రేటు 11.08 శాతంతో రికార్డు సృష్టించిందన్నారు. వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధికి రూ.2,445.47 కోట్లు, విద్యుతశాఖకు రూ.1,558.18కోట్లు, మిషనభగీరథకు రూ. 1,216కోట్లు, వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ ద్వారా రూ.22.50 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా గడిచిన తొమ్మిదేళ్లలో రూ. 984.77కోట్లు, విద్యాశాఖలో రూ.417.82కోట్లతో అభివృద్ధి సాధించామన్నారు. గతంలో జిల్లాలో కేవలం ఆరు గురుకులాలు ఉండేవని, తెలంగాణ ఏర్పడిన తర్వాత జిల్లాలో 19 గురుకులాలు, రెండు డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. వెనకబడిన వర్గాల సేవా సహకార అభివృద్ధి సంఘం నుంచి రూ.338.28 కోట్లు, అదే శాఖ ద్వారా సంక్షేమానికి రూ.138.74ఖర్చు చేశామన్నారు. గిరిజనాభివృద్ధికి రూ.78.53 కోట్లు, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ద్వారా రూ.13.97కోట్లు, మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా రూ.27.13కోట్లు ఖర్చు చేశామన్నారు. మహిళా, శిశు సంక్షేమ, దివ్యాంగులు, వయోవృద్ధులకు రూ.74.44 కోట్లు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పురపాలక సంఘం అభివృద్ధికి రూ.556.57కోట్లు, పట్టణ నిరుపేద, పేదరిక నిర్మూలనకు రూ.1456.20కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.6180.90 కోట్లు వెచ్చించినట్లు వివరించారు. రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ పాలన సాగిస్తున్నారన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిలో నూ రాష్ట్రం ముందడుగు వేస్తోందన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక వెలుగులు నింపామని గుర్తుచేశారు. అనంతరం అమరుల కుటుంబాలకు, తెలంగాణ ఉద్యమకారులను సన్మానించారు. ఈ సందర్భంగా 382 స్వయంసహాయ సంఘాలకు రూ. 18.54కోట్లు, స్ర్తీ నిధి కింద 659 సంఘాలకు రూ.13.14కోట్లు మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు రూ.12.23 కోట్లు చెక్కులు అందజేశారు. అంతకుముందు జాతీయజెండాను ఆవిష్కరించారు. శకటాల్లో ఎస్సీ కార్పొరేషనకు ప్రథమ బహుమతితో పాటు ఐసీడీఎస్‌, మత్స్యశాఖ, డీఆర్‌డీఏ శకటాలకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న బృందాలకు బహుమతులు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ చైర్‌పర్సన గుజ్జ దీపికాయుగంధర్‌రావు, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్‌, బొల్లం మల్లయ్యయాదవ్‌, శానంపూడి సైదిరెడ్డి, కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావ్‌, ఎస్పీ ఎస్‌.రాజేంద్రప్రసాద్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, అదనపు కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌, జడ్పీ వైస్‌చైర్మన గోపగాని వెంకటనారాయణగౌడ్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:27:03+05:30 IST