Share News

ప్రజల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులే

ABN , First Publish Date - 2023-12-11T00:06:05+05:30 IST

రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ ఉన్నా పేద ప్రజల పక్షాన పోరాడేది, ప్రజా సమస్యలపై పాలకులను నిలదీసేది కమ్యూనిస్టులేనని మాజీ ఎమ్మెల్సీ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుప ల్లి సీతారాములు అన్నారు. ఆదివారం స్థానిక సుందరయ్య భవన్‌లో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రజల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులే

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు

భువనగిరి రూరల్‌, డిసెంబరు 10: రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ ఉన్నా పేద ప్రజల పక్షాన పోరాడేది, ప్రజా సమస్యలపై పాలకులను నిలదీసేది కమ్యూనిస్టులేనని మాజీ ఎమ్మెల్సీ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుప ల్లి సీతారాములు అన్నారు. ఆదివారం స్థానిక సుందరయ్య భవన్‌లో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో శ్రద్ధ పెట్టకుండా, ఎన్నికల మేనిఫెస్టోలో అమలు సాధ్యంకాని వాగ్ధానాలు ఇచ్చి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలను పలు రకాల ప్రలోభాలకు గురి చేసినా, ప్రజా మద్దతును పోగొట్టుకొని గద్దె దిగిన బీఆర్‌ఎస్‌ చరిత్రను ప్రజలు గమనించారన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఉన్న ఆరు గ్యారంటీ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తే ప్రజలకు ఇబ్బందులు ఉండవన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌, నాయకులు భట్టుపల్లి అనురాధ, కొండమడుగు నర్సింహ, పైళ్ల ఆశయ్య, కూరపాటి రమేష్‌, అనగంటి వెంకటేష్‌, మాటూరి బాల్‌రాజ్‌, దోనూరు నర్సిరెడ్డి, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, నర్సింహ, పెంటయ్య, ఉపేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-11T00:06:06+05:30 IST