కులవృత్తుల సంక్షేమానికి సీఎం కృషి
ABN , First Publish Date - 2023-06-09T01:16:15+05:30 IST
కులవృత్తుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మత్స్య అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ ముదిరాజ్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో గురువారం భువనగిరిలో నిర్వహించిన నియోజకవర్గ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. సాగు నీటి ప్రాజెక్ట్‌లు, కులవృత్తుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ చూపుతున్న శ్రద్ధ ఫలితంగా తెలంగాణలో మత్స్యసంపద గణనీయంగా పెరిగిందన్నారు.
చేపలు పట్టే వారందరికీ సభ్యత్వం
మత్స్య అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్
భువనగిరి టౌన్, జూన్ 8: కులవృత్తుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మత్స్య అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ ముదిరాజ్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో గురువారం భువనగిరిలో నిర్వహించిన నియోజకవర్గ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. సాగు నీటి ప్రాజెక్ట్‌లు, కులవృత్తుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ చూపుతున్న శ్రద్ధ ఫలితంగా తెలంగాణలో మత్స్యసంపద గణనీయంగా పెరిగిందన్నారు. గతంలో తెలంగాణకు ఆంధ్ర, తదితర ప్రాంతాల నుంచి చేపలు దిగుమతి అయ్యేవని, నేడు అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. చేపల మార్కెటింగ్‌కు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, ప్రతీ ప్రాంతంలో ఫిష్ మార్కెట్లను నిర్మిస్తోందన్నారు. గంగపుత్రులు కాకుండా చేపలు పట్టే ముదిరాజ్ కులస్థులందరికీ సహకార సంఘాల్లో త్వరలో సభ్యత్వం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. చేపపిల్లలతోపాటు చేపలు పట్టేందుకు వలలు, పడవలు, రవాణా చేసేందుకు వాహనాలు, విక్రయించేందుకు మార్కెట్లు నిర్మిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ బస్వాపూర్ రిజర్వాయర్‌తో పాటు అన్ని చెరువులు మిషన్ కాకతీయతో చేపల పెంపకానికి అనువుగా మారాయన్నారు. భువనగిరిలో చేపల మార్కెట్ నిర్మాణానికి త్వరలో స్థలం, నిధులు కేటాయిస్తామన్నారు. కలెక్టర్ పమేలాసత్పథి మాట్లాడుతూ జిల్లాలోని సొసైటీల్లో 9,623 మంది మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారని, అర్హులందరికీ సభ్యత్వం ఇవ్వనున్నట్లు తెలిపారు. చెరువులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జిల్లా మత్స్య శాఖ అధికారి రాజారాం మాట్లాడుతూ జిల్లాలోని 15 చెరువుల్లో 18.4 లక్షల రొయ్యలు, జిల్లాలోని 790 చెరువుల్లో 3కోట్ల చేప పిల్లలను వదిలినట్లు తెలిపారు. మూడు రోజులపాటు నిర్వహించే ఫిష్ స్టాళ్లను జడ్పీచైర్మన్ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి ప్రారంభించారు. తిమ్మాపూర్ సంఘానికి మత్స్యపారిశ్రామిక సహకార సంఘం రిజిస్ర్టేషన్ పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్‌తివారీ, మునిసిపల్, రైతు బంధు చైర్మన్లు ఎనబోయిన ఆంజనేయులు కొలుపుల అమరేందర్, ఎంపీపీ నరాల నిర్మల, జడ్పీటీసీ బీరుమల్లయ్య, మునిసిపల్ వైస్‌చైర్మన్ చింతల కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.