సీఎంఆర్‌ చెల్లించకుంటే బ్లాక్‌లిస్ట్‌లో పెడతాం: కలెక్టర్‌

ABN , First Publish Date - 2023-03-19T00:12:34+05:30 IST

బకాయి ఉన్న కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌)ను చెల్లించని మిల్లులను బ్లాక్‌లి్‌స్టలో పెడతామని కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావ్‌ హెచ్చరించారు. సీఎంఆర్‌ పెండింగ్‌పై సంబంధిత అధికారులు, ఐకేపీ సిబ్బంది, మెప్మా అధికారులతో పాటు మిల్లర్లతో కలెక్టరేట్‌లో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

సీఎంఆర్‌ చెల్లించకుంటే  బ్లాక్‌లిస్ట్‌లో పెడతాం: కలెక్టర్‌
కలెక్టరేట్‌లో సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకట్రావ్‌

సూర్యాపేట(కలెక్టరేట్‌), మార్చి 18 : బకాయి ఉన్న కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌)ను చెల్లించని మిల్లులను బ్లాక్‌లి్‌స్టలో పెడతామని కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావ్‌ హెచ్చరించారు. సీఎంఆర్‌ పెండింగ్‌పై సంబంధిత అధికారులు, ఐకేపీ సిబ్బంది, మెప్మా అధికారులతో పాటు మిల్లర్లతో కలెక్టరేట్‌లో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సీజనకు సంబంధించి సీఎంఆర్‌ బకాయి ఉన్న మిల్లులు ఈ నెల చివరి నాటికి పూర్తిగా చెల్లించాలన్నారు. 2020-21 రబీ నుంచి జిల్లాలో కొన్ని మిల్లులు సీఎంఆర్‌ బకాయి ఉన్నాయని, చెల్లింపులకు ప్రభుత్వం మరో 15 రోజులు గడువు ఇచ్చిందన్నారు. లక్ష్యం పూర్తి చేయని మిల్లులకు ఈ పర్యాయం సీఎంఆర్‌ ఇవ్వకుండా, బ్లాక్‌లిస్టులో పెడతామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహనరావు, జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన అధ్యక్షుడు ఇమ్మడి సోమనర్సయ్య, సివిల్‌ సప్లయ్‌ డీఎం రాంపతి, డీసీవో శ్రీధర్‌, డీఏవో రామారావునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

కోదాడ రూరల్‌ : అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ వెంకట్రావ్‌ అన్నారు. మండలంలోని చిమిర్యాల గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఆయన తనిఖీచేశారు. గ్రామ ంలో పారిశుధ్య చర్యలు చేపట్టాలని సర్పంచ కొండా శైలజను ఆదేశించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్‌ మరింత నాణ్యతతో అందించాలని సూచించారు. ఆయన వెంట ఆర్డీవో కిషోర్‌కుమార్‌, తహసీ ల్దార్‌ శ్రీనివా్‌సశర్మ, ఎంపీవో నాగేశ్వరరావు, ఎంపీడీవో విజయశ్రీ పాల్గొన్నారు.

కొత్తగూడెం సర్పంచపై

అనంతగిరి : మండలంలోని కొత్తగూడెం గ్రామాన్ని కలెక్టర్‌ వెంకట్రావ్‌ ఆకస్మీకంగా సందర్శించారు. గ్రామంలో పర్యటించి రోడ్ల వెంట అస్తవ్యస్తంగా ఉన్న పెంటదిబ్బలను చూసి గ్రామ కార్యదర్శి వెంకటే్‌షపై అసహనం వ్యక్తం చేశారు. మిషన భగీరథ లీకేజీలపై, గ్రామంలోకి నీరు సరఫరా కాకపోవడాన్ని స్థానికులు ఆయన దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో మిషన భగీరథ అధికారులు ఎవరూ అందుబాటులోకి రాకపోవడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే తాగునీటి అందించాలని ఎంపీడీవో విజయను ఆదేశిం చారు. కొత్తగూడెం నుంచి గోండ్రియాల వరకు నిర్మిస్తున్న బీటీరోడ్డు నిర్మాణంలో నాణ్యాత పాటించాలని సూచించారు. కలెక్టర్‌ వెంట ఆర్డీవో కిషోర్‌కుమార్‌, తహసీల్దార్‌ సంతో్‌షకిరణ్‌, పంచాయతీరాజ్‌ ఏఈ హర్ష పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T00:12:34+05:30 IST