చంద్రబాబును వెంటనే విడుదల చేయాలి: టీడీపీ
ABN , First Publish Date - 2023-09-18T02:09:59+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని వెంటనే విడుదల చేయాలని టీడీపీ బీసీ సెల్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ రామజోగి డిమాండ్ చేశారు.

హుజూర్‌నగర్, మునగాల: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని వెంటనే విడుదల చేయాలని టీడీపీ బీసీ సెల్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ రామజోగి డిమాండ్ చేశారు. ఆదివారం హూజూర్‌నగర్‌లో భారీ ప్రదర్శన నిర్వహించి అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జగనకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో ఎస్‌కే ఆలీపాషా, నలమాద శ్రీనివాస్, శ్రీనివాస్, సురే్‌ష పాల్గొన్నారు.
- చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో మునగాల మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, ఆస్పత్రి సమీపంలో నిరాహార దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో నాయకులు ఓరుగంటి ప్రభాకర్, కొల్లు వెంకటేశ్వరరావు, నంబూరి సూర్యం, నాదెండ్ల గోపాల్‌రావు, వేమూరి సత్యనారాయణ, గాడిపర్తి మోహనరావు, ఎస్‌కే సైదా, సీహెచ మాధవరావు, జంగిలి గోపి, ఎర్రం కృష్ణారెడ్డి, అఖిలపక్ష నాయకులు కృష్ణప్రసాద్, సుంకర అజయ్‌కుమార్, కాసర్ల శ్రీను, తొగరు రమేష్ తదితరులు సంఘీభావం తెలిపారు.
మానం