బీఆర్‌ఎస్‌ పేదల పార్టీ

ABN , First Publish Date - 2023-08-12T00:39:00+05:30 IST

బీఆర్‌ఎస్‌ పేదల పార్టీ అని విద్యుత్‌శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని లబ్ధిదారులకు బీసీ బంధు చెక్కులు పంపిణీ చేసి వారు మాట్లాడారు. సబ్బండ వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని, అందులో భాగంగానే బీసీ బంధు కింద రూ.1లక్ష సాయం అందిస్తున్నామన్నారు.

బీఆర్‌ఎస్‌ పేదల పార్టీ

మంత్రి జగదీ్‌షరెడ్డి

కోదాడ, ఆగస్టు 11: బీఆర్‌ఎస్‌ పేదల పార్టీ అని విద్యుత్‌శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని లబ్ధిదారులకు బీసీ బంధు చెక్కులు పంపిణీ చేసి వారు మాట్లాడారు. సబ్బండ వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని, అందులో భాగంగానే బీసీ బంధు కింద రూ.1లక్ష సాయం అందిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా బీసీ బంధు పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలు కులవృత్తులను విస్మరించడం వల్లే వాటిని నమ్ముకున్నవారు కూలీలుగా మారారన్నారు. గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి కుల వృత్తులే కీలకమని గుర్తించిన సీఎం కేసీఆర్‌ బీసీ, కుల వృత్తిదారులకు రూ.1లక్ష ఆర్థిక సహాయం చేస్తున్నారన్నారు. గృహలక్ష్మి పథకంతో పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం రూ.3లక్షలు ఇస్తోందన్నారు. బీసీ బంధు కింద కోదాడ నియోజకవర్గంలో 294మందికి రూ. 2.94కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. గతంలో సాగర్‌ ఎడమ కాల్వకు వరుసగా ఏడేళ్లు చుక్క నీరు ఇవ్వకపోయినా, ఈ ప్రాంత మంత్రులు మాట్లాడని పరిస్థితి, పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. పదవుల కోసం ఓటు వేసి గెలిపించిన ప్రజలను తాకట్టు పెట్టిన చరిత్ర ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ నాయకులదని ఆరోపించారు. ప్రజా సమస్యలు పట్టించుకోని కాంగ్రెస్‌ నాయకులకు ఆకారంతోపాటు, అహంకారం కూడా ఎక్కువేనన్నారు. కరువు వచ్చినప్పడు ప్రశ్నార్థకమవుతున్న కృష్ణ ఆయకట్టు పరివాహక ప్రాంతానికి కాళేశ్వరం జలాలు తేవడం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో కోదాడలో గులాబీ జెండా ఎ గురుతుందని, నియోజకవర్గ అభివృద్ధి రెట్టింపు అవుతుందన్నారు. కా ర్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ వనపర్తి శిరీష, ఎంపీపీ కవితారెడ్డి, సుంకరి అజయ్‌కుమార్‌, కల్లూరి పద్మజా, తదితరులు పాల్గొన్నారు.

క్రీడలతోనే అసలైన విద్య

సూర్యాపేట(కలెక్టరేట్‌): చిన్నారులకు క్రీడలతోనే అసలైన విద్యలభిస్తుందని, పిల్లలు ఒత్తిడిని జయించగలుగుతారని మం త్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావ్‌తో కలిసి జిల్లాలో ని 155 ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన క్రీడా సామగ్రిని పంపిణీ చేసి మాట్లాడారు. చిన్నారుల్లో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు క్రీడా సామగ్రిని ఇస్తున్నట్లు తెలిపారు. చిన్న చిన్న కారణా లతో పిల్లలు ఇటీవల అఘాయిత్యాలకు పాల్పడటానికి తరగతి గది, హాస్టల్‌ గదులకు పరిమితం కావడమే కారణమన్నారు. ఇటీవల సూర్యాపేట నియోజకవర్గంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో 27వేల మంది మహిళలు పాల్గొన్నారని, 50ఏళ్లు పైబడి న వారు సైతం కబడ్డీ ఆడారని అన్నారు. పిల్లలకు ఉపయోగపడే ఏ కార్యక్రమంలోనైనా తన భాగస్వామ్యం ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీవో వీరబ్రహ్మచారి, డీఈవో అశోక్‌, డీఎ్‌సడీవో వెంకటరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లేష్‌, తదితరులు పాల్గొన్నారు.

మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యం

మహిళా సాధికారతకు సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని వాసవి-వనితా క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక సీమంతాల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కులమత భేదాలు లేకుండా పేద మహిళలకు సీమంతాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో 13,90,636 మంది బాలింతలకు సీఎం కేసీఆర్‌ కిట్‌, 6.84లక్షల మంది గర్భిణులకు పౌష్ఠికాహార కిట్‌లు అందించామన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా 18,46,635 మంది మహిళలకు లబ్ధిచేకూరిందన్నారు. ఆడపిల్లల రక్షణకు షీటీమ్స్‌ ఏర్పాటు చేశామన్నారు. మహిళల ఆరోగ్యం కోసం ఇటీవల ఆరోగ్యమహిళా పథకం ప్రవేశపెట్టామన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్‌పర్సన్‌ ఉప్పల లలిత, వాసవి-వనితా క్లబ్‌ సభ్యులు ఉప్పల ఆనంద్‌, గుండా శ్రీదేవి, కలకోట అనిత, తోట శ్యాం, రాచకొండ శ్రీనివాస్‌, చ ల్లా లక్ష్మికాంత్‌, కమలాకర్‌, వెంపటి సురేష్‌, కలకోట లక్ష్మినారాయణ, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలో నిర్మాణం పూర్తయిన ఇంటిగ్రెటెడ్‌ మార్కెట్‌ను మంత్రి పరిశీలించారు. ఆయన వెంట కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావ్‌, మునిసిపల్‌ కమిషనర్‌ రామాంజులరెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు.

Updated Date - 2023-08-12T00:39:00+05:30 IST