బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒక్కటే
ABN , First Publish Date - 2023-05-26T00:38:29+05:30 IST
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు అన్నారు. గురువారం సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఫంక్షన హాల్‌లో నిర్వహించిన ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.

సూర్యాపేట సిటీ, మే 25: బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు అన్నారు. గురువారం సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఫంక్షన హాల్‌లో నిర్వహించిన ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరుల త్యాగాల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన భగీరథ, మిషన కాకతీయ పథకాల పేరిట లక్షల కోట్ల రూపాయలను కేసీఆర్ కుటుం బం దోచుకుందని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో రేవంతరెడ్డి అడ్డంగా దొరికినా, కేసీఆర్‌తో కుదుర్చుకున్న లోపాయకారి ఒప్పందం కారణంగానే ఇప్పటివరకు ఆ కేసు ముందుకు కదల్లేదని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి, జిల్లా ఇనచార్జి చాడ శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కడియం రామచంద్రయ్య, కర్నాటి కిషన, కాపా రవికుమార్, కనగాల నారాయణ, శేఖర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా, యశ్వంత పాల్గొన్నారు.
ఐ తెలిపారు.