బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవాలు
ABN , First Publish Date - 2023-05-03T00:25:13+05:30 IST
భువనగిరి పట్టణం మాసుకుంటలో బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
భువనగిరి టౌన్/ ఆత్మకూరు(ఎం), మే 2: భువనగిరి పట్టణం మాసుకుంటలో బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆరు రోజుల పాటు జరుగనున్న ఉత్సవాల్లో మొదటి రోజున హోమ పూజలు చేసి బొడ్రాయికి ధాన్య, ఫల శయ దివాసనం పూజలు చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. మునిసిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అర్చకులు బొడ్రాయి పవిత్రతను, ప్రతిష్టాపన ఆవశ్యకాన్ని వివరించారు. ప్రతిష్టాపన పూర్తయ్యాక నిత్య పూజలు చేయాలని సూచించారు. ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో ప్రజల ఆధార్య దైవంగా కొలిచే శ్రీ రేణుకా ఎల్లమ్మ గ్రామ దేవతకు మంగళవారం ఘనంగా బోనాలు సమర్పించారు. ఉదయం దేవాలయంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ, జమదగ్నిముని ల కల్యాణోత్సవ వేడుకలను కన్నుల పండువగా జరిపించారు. అనంతరం మహిళలు భక్తి శ్రద్ధతో తయారు చేసిన బోనాలను పసుపు కుంకులతో అలంకరించి, నెత్తిన పెట్టుకొని డప్పు చప్పులతో ఊరేంపుగా తీసుకెళ్లి దేవాలయం చుట్టు ప్రదక్షణలు చేసి నైవేద్యం సమర్పించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అఖిలపక్షనాయకులు కుల పెద్దలతోపాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.