త్వరలో అధునాతన సౌకర్యాలతో బోటింగ్‌

ABN , First Publish Date - 2023-06-03T00:28:30+05:30 IST

అధునాతన సౌకర్యాలతో సద్దుల చెరువులో బోటింగ్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు.

త్వరలో అధునాతన సౌకర్యాలతో బోటింగ్‌
సద్దుల చెరువులో బోటింగ్‌ ట్రయల్‌రనలో పాల్గొన్న మంత్రి

సూర్యాపేటటౌన,జూన 2 : అధునాతన సౌకర్యాలతో సద్దుల చెరువులో బోటింగ్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సద్దులచెరువులో బోటింగ్‌ ట్రయల్‌రనను మంత్రి ప్రారంభించారు. సుమారు అరగంటకు పైగా సద్దులచెరువులో బోటింగ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సద్దుల చెరువు వద్ద నిర్మాణాలు చేపడతామన్నారు. బోటింగ్‌తో పాటు ఆహ్లాదం కోసం పార్క్‌, వివిధ రకాల స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.

పండుగలా దశాబ్ది ఉత్సవాలను జరుపుకోవాలి

తిరుమలగిరి : రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పండుగలా నిర్వహించుకోవాలని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి తెలిపారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై తిరుమలగిరి పట్టణంలో తుంగతుర్తి నియోజకవర్గస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధుల సమావేశానికి హాజరై, మాట్లాడారు. అబివృద్ధి, సంక్షేమ పథకాలు సాధించిన ప్రగతిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నా రు. ఒక్కో రోజు పండుగలా జరపాలన్నారు. తుంగతుర్తిలో గతంలో 10 వేల ఎకరాలు సాగు చేస్తే, ప్రస్తుతం కాళేశ్వరం జలాలు వచ్చాక 1,40,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన గుజ్జ దీపికాయుగంధర్‌రావు, కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి, డీఎస్పీ నాగభూషణం, డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌ కుమార్‌, తహసీల్దార్లు, మునిసిపల్‌ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.

మునిసిపల్‌ చైర్‌పర్సన గైర్హాజరు

తుంగతుర్తి నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశానికి తిరుమలగిరి మునిసిపల్‌ చైర్‌పర్సన పోతరాజు రజనీరాజశేఖర్‌ గైర్హాజరయ్యారు. ఈ నెల 19న తిరుమలగిరిలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనానికి కూడా ఆమె హాజరు కాలేదు. దీంతో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. బీఆర్‌ఎ్‌సలో అంతర్గత విభేదాలతోనే, నాయకులతో పొసగకపోవడం కారణంగానే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై చైర్‌పర్సన రజనీని ఫోనలో సంప్రదించగా త్వరలోనే అన్ని విషయాలు చెబుతామన్నారు.

Updated Date - 2023-06-03T00:28:30+05:30 IST