బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం
ABN , First Publish Date - 2023-06-26T00:34:00+05:30 IST
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పడాల శ్రీనివాస్ అన్నారు.
గుండాల, మోటకొండూరు, వలిగొండ, ఆలేరు, జూన్ 25: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పడాల శ్రీనివాస్ అన్నారు. గుండా మండలంలోని సీతారాంపురం, మరిపడగ గ్రామాల్లో మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కేంద్రం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రచారం చేశారు. కార్యక్రమంలో నాయకులు వలందాసు ప్రభాకర్, మరాఠి బీరప్ప, మధన్‌మోహన్‌రెడ్డి, కృష్ణ పాల్గొన్నారు. మోటకొండూరు మండలంలోని ఆరెగూడెం గ్రామంలో మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు పన్నాల చంద్రశేఖర్‌రెడ్డి, పెరబోయిన నరేష్, గాజుల ప్రవీణ్, మాటూరి వెంకటేష్, పెరబోయిన సురేష్, గాజుల బాలకృష్ణ పాల్గొన్నారు. వలిగొండ మండలంలోని లోతుకుంట గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా ఇంటింటి కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ 9 ఏళ్ల కాలంలో చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో నాయకులు రాచకొండ కృష్ణ, పాక పుల్లయ్య, చిలుకమర్రి వీరాచారి, సంకబుడ్డి హరికృష్ణ, మర్రి అయిలయ్య, స్వామి, పాండు, అరుణ్, పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై బీజేపీ నాయకులు ఆలేరులో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు బడుగు జహాంగీర్, కౌన్సిలర్ సంగు భూపతి, బీజేపీ నాయకులు వడ్డెమాన్ కిషన్, కుడికాల మురళి, కటకం వెంకటేష్, రాములు, సందీప్ పాల్గొన్నారు.