బీసీ బంధు ప్రవేశపెట్టాలి

ABN , First Publish Date - 2023-08-22T00:50:01+05:30 IST

: రాష్ట్ర ప్రభుత్వం బీసీలను ఆదుకునేలా బీసీ బంధు ప్రవేశపెట్టాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, వూరరామూర్తియాదవ్‌ అన్నారు.

 బీసీ బంధు ప్రవేశపెట్టాలి
మాట్లాడుతున్న డాక్టర్‌ వూర రామూర్తియాదవ్‌

సూర్యాపేటటౌన, ఆగస్టు 21 : రాష్ట్ర ప్రభుత్వం బీసీలను ఆదుకునేలా బీసీ బంధు ప్రవేశపెట్టాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, వూరరామూర్తియాదవ్‌ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఐఎంఏ ఫంక్షనహాల్‌లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలు జనాభా దామాషా ప్రకారం బీసీలకు పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలను 50 శాతం కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులగణన చేపట్టి వివరాలను వెల్లడించాలన్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తున్నాయని ఆరోపించారు. అన్ని రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించకుంటే రాజకీయ పార్టీలకు భవిష్యత ఉండదని హెచ్చరించారు. జిల్లాకేంద్రంలో సెప్టెంబరు 5వ తేదీన నిర్వహించే బీసీ సింహగర్జనను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు భూమన్నయాదవ్‌, వీరబోయిన లింగయ్యయాదవ్‌, దూదిపాళ ధనుంజయనాయుడు, ఎలిమినేటి రమేష్‌, పచ్చిపాల రామకృష్ణ, డేగల రమేష్‌, పోతుగంటి వీరాచారి, కృష్ణమాచారి, శ్రీనివా్‌సనాయుడు, లక్ష్మీనారాయణ, జటంగి వెంకటనర్సయ్య, అశోక్‌, లింగయ్య, వీరాచారి, సుమన, సాయి, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T00:50:01+05:30 IST