బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక
ABN , First Publish Date - 2023-10-13T00:52:19+05:30 IST
బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక అని పలు పాఠశాలల హెచఎంలు, డైరెక్టర్లు అన్నారు.
ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్: బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక అని పలు పాఠశాలల హెచఎంలు, డైరెక్టర్లు అన్నారు. విద్యా సంస్థలకు దసరా సెలవులను ఈ నెల 13వ తేదీ నుంచి ప్రకటించడంతో గురువారం జిల్లాలోని పలు పాఠశాలల్లో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా బతుకమ్మ ఆట-పాటలతో విద్యార్థులు అలరించారు.
- నడిగూడెంలోని శ్రీసాయి పబ్లిక్ స్కూల్‌లో చిన్నారులు రంగు రంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆడి పాడారు. కోలాట ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సులోచన, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- మఠంపల్లి మండల కేంద్రంలోని సెయింట్ ఆన్స, మాన ఫోర్టు పాఠశాలలో బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో సిస్టర్ సుజాత పాల్గొన్నారు.
- సూర్యాపేట మునిసిపాలిటీ పరిధిలోని రాయినిగూడెం శివారులో ఉన్న శాస్త్ర పాఠశాలలో బతుకమ్మ వేడుకలను ఆటపాటలతో ఘనంగా నిర్వహించారు. అనంతరం దుర్గాదేవి పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన చంద్రశేఖర్, డైరక్టర్లు కరుణారావు, పుష్పలత, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- హుజూర్‌నగర్‌లోని ఎండీఆర్, ఆర్కిడ్స్, శ్రీచైతన్య టెక్నో పాఠశాలలో ఎంగిలి బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో దామోదర్‌రెడ్డి, సరిత, ప్రసాద్, కర్ణ, రాకేష్, భూపాల్‌రెడ్డి, నర్సిరెడ్డి, వెంకటరమణ, వెంకటరెడ్డి, రాంప్రసాద్, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
- పెనపహాడ్ మండలంలోని అనంతారం గ్రామంలోని అరవిందో మాత పాఠశాలలో, గరిడేపల్లి, తిరుమలగిరి, నూతనకల్ మండలాల్లో చిన్నారులు బతుకమ్మ ఆటలు ఆడారు. కార్యక్రమంలో ఎంఈవో నకిరేకంటి రవి ప్రిన్సిపాల్ షేక్ మస్తాన, పాల్గొన్నారు.
-నేరేడుచర్లలోని కృష్ణవేణి, అంజలిస్కూల్, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు అందంగా బతుకమ్మలను పేర్చి ఒక్కొక్కపూవేసి చందమామా.. అంటూ పాటలు పాడుతూ ఉల్లాసంగా గడిపారు. కార్యక్రమంలో జడ్పీహెచ్‌స్ హెచఎం బట్టు మధు,్ల కృష్ణవేణి, అంజలి స్కూల్ డైరక్టర్లు అలుక సైదిరెడ్డి, నళిని తదితరులు పాల్గొన్నారు.