బస్వాపూర్ రిజర్వాయర్ కట్టపై వంటావార్పు
ABN , First Publish Date - 2023-01-31T00:49:20+05:30 IST
కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో ముంపుకు గురవుతున్న బీయన్‌తిమ్మాపూర్ నిర్వాసితులు చేపడుతున్న దీక్షలు సోమవారం నాటికి 63వ రోజుకు చేరాయి.
భువనగిరి రూరల్, జనవరి 30: కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో ముంపుకు గురవుతున్న బీయన్‌తిమ్మాపూర్ నిర్వాసితులు చేపడుతున్న దీక్షలు సోమవారం నాటికి 63వ రోజుకు చేరాయి. ఈసందర్భంగా రిజర్వాయర్ కట్టపై వంటావార్పుతో నిరసన తెలిపి నిరాహార దీక్షలు కొనసాగించారు. కార్యక్రమంలో సర్పంచ్ పిన్నం లత, ఎంపీటీసీ ఉడుత శారద, ఉప సర్పంచ్ ఎడ్ల దర్శన్ రెడ్డి, నిర్వాసితులు జిన్న పాండు, రచ్చ హరినాధ్, పిన్నం పాండు, ఎడ్ల మహేందర్ రెడ్డి, సత్తయ్య, నర్సింహ, రాజు, దశరథ పాల్గొన్నారు.