ఆటో ట్రాలీ బోల్తా.. ఒకరి మృతి

ABN , First Publish Date - 2023-06-25T00:37:01+05:30 IST

ఆటో బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. యాదాద్రి భువనగిరి భూదాన్‌పోచంపల్లి మండల కేంద్రంలో శనివారం ఈ ఘటన జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణ పరిధిలోని సీతవానిగూడెం గ్రామానికి చెందిన వలసకూలీ కడెం అజయ్‌కుమార్‌ (18) తాపీ పనికి వెళ్తుంటాడు. రోజుమాదిరిగా అతడు కూలీ పనికి వెళ్లాడు.

ఆటో ట్రాలీ బోల్తా.. ఒకరి మృతి
బోల్తాపడిన ఆటో

భూదాన్‌పోచంపల్లి, జూన్‌ 24: ఆటో బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. యాదాద్రి భువనగిరి భూదాన్‌పోచంపల్లి మండల కేంద్రంలో శనివారం ఈ ఘటన జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణ పరిధిలోని సీతవానిగూడెం గ్రామానికి చెందిన వలసకూలీ కడెం అజయ్‌కుమార్‌ (18) తాపీ పనికి వెళ్తుంటాడు. రోజుమాదిరిగా అతడు కూలీ పనికి వెళ్లాడు. కూలీపని ముగించుకున్నాక అతడు, అతనితోపాటు మరో నలుగురు కలిసి ఒక ఆటోట్రాలీలో కొత్తగూడేనికి వెళ్లారు. ఆటో ట్రాలీని భూదాన్‌పోచంపల్లి పట్టణం వెంకటరమణ కాలనీకి చెందిన అభిలాష్‌ నడిపాడు. కాగా, వెనుక ఉన్న ట్రాలీలో అజయ్‌కుమార్‌తోపాటు విజయ్‌, కార్తీక్‌, పాండు కలిసి వెళ్తుండగా అతివేగం కారణంగా జలాల్‌పూర్‌ గ్రామశివారులోని భూదాన్‌పోచంపల్లి-కొత్తగూడెం ప్రధాన రహదారిపై బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలై రోడ్డుపై పడిన వారిని గమనించిన వాహనదారులు 108లో హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అజయ్‌కుమార్‌ అప్పటికే మృతి చెందాడు. కాగా నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారికి చికిత్స అందిస్తున్నారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. మృతుడు కడెం అజయ్‌కుమార్‌ తండ్రికి ఒక్కడే కుమారుడు. కాగా, చికిత్స పొందుతున్న వారిలో తాపీ పని చేసే కార్మికుడు బండారి అభిలాష్‌, బండారి కార్తీక్‌, శేషరాజు పాండు, విజయ్‌ భూదాన్‌పోచంపల్లికి చెందిన వారు. వీరంతా తాపీ పనికి వెళ్తుంటారు.

ట్రాక్టర్‌ బోల్తాపడి మహిళ..

మాడ్గులపల్లి, జూన్‌ 24: ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడడంతో మహిళ తీవ్రగాయాలై మృతిచెందిన సంఘటన మండలంలోని పాములపాడు గ్రామంలో శనివారం జరిగింది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వేముల జానయ్య ట్రాక్టర్‌తో గ్రామ సమీపంలోని రాళ్లను తెచ్చేందుకు 10 మంది కూలీలతో వెళ్లాడు. ట్రాక్టర్‌ లోడ్‌ వేసుకొని గ్రామానికి వస్తుండగా ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన పగిడిమర్రి సైదమ్మ(38)కు గాయాలు కావడంతో వెంటనే సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో హైదరాబాద్‌ తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందింది. సైదమ్మ భర్త లచ్చయ్య ఫిర్యాదుమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనయ్య తెలిపారు.

Updated Date - 2023-06-25T00:37:01+05:30 IST