సమస్యలు పరిష్కరించకపోతే తగిన గుణపాఠం
ABN , First Publish Date - 2023-08-02T00:44:40+05:30 IST
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నూనె రామస్వా మి హెచ్చరించారు. గ్రామపంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారం 27వ రోజుకు చేరింది. మండలపరిషత్ కార్యాలయం ఎదుట కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపి ఆయ న మాట్లాడారు.
ఏయూటీయూసీ జిల్లా అధ్యక్షుడు రామస్వామి
చింతపల్లి, ఆగస్టు 1: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నూనె రామస్వా మి హెచ్చరించారు. గ్రామపంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారం 27వ రోజుకు చేరింది. మండలపరిషత్ కార్యాలయం ఎదుట కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపి ఆయ న మాట్లాడారు. గ్రామపంచాయతీ కార్మికులు చాలీ చాలని వేతనంతో పనిచేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. వెంటనే కార్మికులకు కనీస వేతనం రూ.19వేలు చెల్లించడంతోపాటు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు షేక్ శం షుద్దీన్, వి.శ్రీకాంత్, మాడ్గుల సైదులు, యాదయ్య, నర్సింహ, భారతమ్మ, అబ్బయ్య, లక్ష్మమ్మ, కృష్ణమ్మ, సాలమ్మ, పోచమ్మ, యాదమ్మ, నాగమ్మ పాల్గొన్నారు.
దున్నపోతుకు వినతి
కనగల్, నార్కట్‌పల్లి, చిట్యాల, వేములపల్లి: కనగల్, నార్కట్‌పల్లిలో పంచాయతీ కార్మికులు దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. నార్కట్‌పల్లిలో పంచాయతీ కార్మికులకు మధ్యాహ్న భోజన కార్మికులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కానుగు లింగస్వామి, విజ య్, కొప్పోల్ శంకర్, దీనారాణి, మంజుల, రేణుక, యాదగిరి, సాలమ్మ, అండాలు, నగేష్, కిరణ్, నరుకుడుపిందెల నర్సిం హ, షకీల్, వెంకన్న, గోపాలు, యాదయ్య, అజయ్, ఎల్లయ్య, అండాలు,యాదమ్మ, ఎల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు. చిట్యాలలో జీపీ కార్మికులు భిక్షాటన చేశారు. కార్యక్రమంలో నారబో యిన శ్రీనివాస్, యూనియన్ నాయకులు మహంకాళి బాల మ్మ, మహంకాళి మల్లమ్మ, గణేష్, యాదయ్య పాల్గొన్నారు. వేములపల్లిలో తహసీల్దార్ వెంకటేశానికి జీపీ కార్మికులు వినతిపత్రం అందచేశారు. కార్యక్రమంలో పాల్వాయి సైదు లు, ఎల్గపల్లి నర్సయ్య, ఈట మారయ్య, యలమందాచారి, లక్ష్మీ, శ్రీను, వెంకన్న, నగేష్, ప్రసాద్, సోములు పాల్గొన్నారు.
పారిశుధ్య పనులను అడ్డుకున్న కార్మికులు
కట్టంగూరు: మండలంలోని అయిటిపాముల గ్రామంలో పారిశుధ్య పనులు నిర్వహించేందుకు పక్క గ్రామం నుంచి వచ్చిన కూలీలను పంచాయతీ కార్మికులు అడ్డుకున్నారు. కూ లీలతో పనులు చేయించవద్దని సర్పంచ్‌ను కార్మికులు వేడుకో గా, వారిని పంపి జీపీ కార్మికుల సమ్మెకు సర్పంచ్ సంఘీభా వం తెలిపారు. కార్యక్రమంలో కత్తుల రామలింగయ్య, పొన్న అంజయ్య, తాటి కొండయ్య, కానుగు వెంకన్న, రాంబాబు, జానయ్య, లింగయ్య, రాజు, వినోద్, అంజమ్మ, పార్వతమ్మ, భాగ్యరేఖ పాల్గొన్నారు.