రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం
ABN , First Publish Date - 2023-08-22T01:34:48+05:30 IST
చౌటుప్పల్ మండలం తూప్రానపేట జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం చెందాడు.
చౌటుప్పల్ రూరల్, ఆగస్టు 21: చౌటుప్పల్ మండలం తూప్రానపేట జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం చెందాడు. సీఐ దేవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తి (40) నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ వైపు వెళుతున్న లారీ డీకొట్టింది. తీవ్రగాయాలకు గురైన గుర్తు తెలియని వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.