అన్నదానానికి అఖండ సినిమా నిర్మాత విరాళం

ABN , First Publish Date - 2023-06-30T01:15:57+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మట్టపల్లి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో నిత్య అన్నదానానికి సినీ నిర్మాత(అఖండ సినిమా) మిర్యాల రవీందర్‌రెడ్డి దంపతులు గురువారం రూ.101116ల చెక్కును ఆలయ ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌లకు అందజేశారు.

అన్నదానానికి అఖండ సినిమా నిర్మాత విరాళం

మఠంపల్లి, జూన్‌ 29: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మట్టపల్లి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో నిత్య అన్నదానానికి సినీ నిర్మాత(అఖండ సినిమా) మిర్యాల రవీందర్‌రెడ్డి దంపతులు గురువారం రూ.101116ల చెక్కును ఆలయ ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌లకు అందజేశారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురష్కరించుకుని కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు కె.వెంకటనారాయణ, కొండల్‌రెడ్డి, చల్లాప్రకాష్‌, కామేశ్వరమ్మ, గోలి శ్రీనివాస్‌, తూమాటి శ్రీనివాసాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-30T01:15:57+05:30 IST