మార్పులకు అనుగుణంగా బోధన

ABN , First Publish Date - 2023-06-01T01:01:59+05:30 IST

సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యను బోధించాలని సీబీఎ్‌సఈ ఢిల్లీ ప్రతినిధి పీవీ సాయిరంగారావు అన్నారు. బుధవారం భువనగిరి జీనియస్‌ హైస్కూల్‌లో జరిగిన సీబీఎ్‌సఈ రెండు రోజుల శిక్షణా తరగతుల ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు.

మార్పులకు అనుగుణంగా బోధన
సమావేశంలో మాట్లాడుత్ను సాయి రంగారావు

భువనగిరి టౌన్‌, మే 31: సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యను బోధించాలని సీబీఎ్‌సఈ ఢిల్లీ ప్రతినిధి పీవీ సాయిరంగారావు అన్నారు. బుధవారం భువనగిరి జీనియస్‌ హైస్కూల్‌లో జరిగిన సీబీఎ్‌సఈ రెండు రోజుల శిక్షణా తరగతుల ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర అన్నారు. బోధనా నైపుణ్యం పెంపొందించుకోవాలని, విద్యార్థులతో సత్సంబంధాలు కొనసాగించాలని, పాఠ్యాంశాలతోపాటు నైతిక విలువలు బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఎంజీయూ పాలక మండలి సభ్యుడు డాక్టర్‌ బి.సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ సీబీఎ్‌సఈ సిలబస్‌ చదివిన వారికి మెరుగైన విద్య, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో సుధారాణి, థామస్‌ చాకో, జి.రవి, జయేష్‌, అరుణ, రాజేశ్వరి, సాయిరాజేందర్‌, శ్రీకాంత్‌, చంద్రం, అభిషేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-01T01:01:59+05:30 IST