నేటి నుంచి డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ
ABN , First Publish Date - 2023-09-19T23:47:52+05:30 IST
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జారీ చేసిన టీఆర్టీ నోటిఫికేషన్‌కు అనుగుణంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ బుధవారం నుంచి ప్రా రంభం కానుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 503 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నెల 6న పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి విద్యాశాఖ సన్నాహాలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు అక్టోబరు 21 వరకు గడువు
నవంబరు 20 నుంచి 30 వరకు పరీక్షలు
నల్లగొండ, సెప్టెంబరు 19: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జారీ చేసిన టీఆర్టీ నోటిఫికేషన్‌కు అనుగుణంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ బుధవారం నుంచి ప్రా రంభం కానుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 503 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నెల 6న పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. మంగళవారం అర్ధరాత్రి 12గంటల నుంచే అభ్యర్థులు దరఖాస్తులు చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. అక్టోబరు 21 వర కు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబరు 20 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ జీవో ప్రకారం వయో పరిమితి సడలింపు వర్తించనుంది. దరఖాస్తు సహా ఇతర వివరాల కోసం అభ్యర్థులు హెచ్‌టీటీపీ://స్కూల్‌ఎడ్యూ.తెలంగాణ.గౌట్.ఇన్ వెబ్‌సైట్ ను సంప్రదించాలని అధికారులు తెలిపారు. ఎస్జీటీ పోస్టుల కు కేవలం డీఎడ్ పూర్తి చేసిన వారే అర్హులు కాగా, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు బీఎడ్ సంబంధిత మెథడాలజీ చేసినవారే అర్హులు. అదేవిధంగా నాలుగేళ్ల డీఎడ్ పూర్తి చేసిన వారు కూడా ఈ పరీక్ష రాయవచ్చు. ఆయా కోర్సుల్లో జనర ల్ కేటగిరీ అభ్యర్థులు 50శాతం మార్కులతో, రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులు 45శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండా లి.పీఈటీ పోస్టులకు అభ్యర్థులు ఇంటర్‌లో 50శాతం మా ర్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. యూజీడీ, పీఈటీ కోర్సు కూ డా పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా డిగ్రీ విద్యార్థులు బీపీఈడీ కోర్సులో ఉత్తీర్ణత సాధించాలి. బీఎడ్, డీఎడ్ చివరి సంవత్సరం, ఆఖరి సెమిస్టర్ చదివే అభ్యర్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1,000. అదనంగా మరో పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు ఒక్కో దానికి రూ.1,000 చొప్పున ఫీజు చెల్లించాలి. అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 2023 జూలై 1 నాటికి 44 ఏళ్లు. ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు, మాజీ సైనికులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయో సడలింపు ఉంది. రాత పరీక్ష అక్టోబరు 20 నుంచి 30 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్టు (సీబీటీ) పద్ధతిలో నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఉమ్మడి జిల్లా కేంద్రం నల్లగొండలో నిర్వహించనున్నారు. దరఖాస్తుల ప్రక్రియలో భాగంగా అభ్యర్థి విద్యార్హతలు, వ్యక్తిగత సమాచారం, ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
జిల్లాల వారీగా పోస్టులు ఇలా...
జిల్లా ఎస్‌ఏ ఎస్జీటీ ఎల్‌పీ పీఈటీ మొత్తం
నల్లగొండ 86 102 25 06 219
సూర్యాపేట 80 78 23 04 185
యాదాద్రి 39 38 20 02 99
మొత్తం 205 218 68 12 503