మద్యం బాటిల్‌లో పురుగు

ABN , First Publish Date - 2023-02-13T00:28:33+05:30 IST

మద్యం బాటిల్‌లో పురుగు కనిపించింది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలులోని లక్ష్మీ వైన్‌ షాపులో ఈ ఘటన జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఆదివారం అమ్మనబోలులో ఓ వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన ఓ వ్యక్తి స్థానిక లక్ష్మీ వైన్స్‌లో డాలర్‌ బ్రాండ్‌కు చెందిన వైన్‌ (ఆఫ్‌) బాటిల్‌ను కొనుగోలు చేశాడు.

మద్యం బాటిల్‌లో పురుగు
మద్యం సీసాలో పురుగు

నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 12: మద్యం బాటిల్‌లో పురుగు కనిపించింది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలులోని లక్ష్మీ వైన్‌ షాపులో ఈ ఘటన జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఆదివారం అమ్మనబోలులో ఓ వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన ఓ వ్యక్తి స్థానిక లక్ష్మీ వైన్స్‌లో డాలర్‌ బ్రాండ్‌కు చెందిన వైన్‌ (ఆఫ్‌) బాటిల్‌ను కొనుగోలు చేశాడు. సీసాను పరిశీలించగా అందులో పురుగు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే వైన్‌ షాపు కౌంటర్‌లో ఉన్న వ్యక్తికి చూపించడంతో ఆ వైన్‌ బాటిల్‌ను వాపసు తీసుకున్నాడు. గతంలో కూడా కేఎఫ్‌ లైట్‌ బ్రాండ్‌కు చెందిన బీరు బాటిళ్లలో కూడా ఇలాగే పురుగులు, చెత్త రావడం జరిగిందని మద్యం ప్రియులు చెబుతున్నారు.

కంపెనీకి ఫిర్యాదు చేశాం: డాలర్‌ బ్రాండ్‌కు చెందిన వైన్‌ బాటిల్‌లో పురుగులు వచ్చిన మాట వాస్తవమేనని లక్ష్మీవైన్స్‌ ఓనర్‌ భూపతి నర్సింహ తెలిపారు. పురుగు వచ్చిన విషయమై సంబంధిత బ్రాండ్‌ కంపెనీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశామన్నారు.

Updated Date - 2023-02-13T00:28:35+05:30 IST