ఆవులను తరలిస్తున్న వ్యాన బోల్తా

ABN , First Publish Date - 2023-09-20T00:04:37+05:30 IST

అక్రమంగా ఆవులను తరలిస్తున్న బోలోరో వ్యాన బోల్తా పడిన సంఘటన మునిసిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది.

 ఆవులను తరలిస్తున్న వ్యాన బోల్తా

చౌటుప్పల్‌ మునిసిపాలిటీ, సెప్టెంబరు 19: అక్రమంగా ఆవులను తరలిస్తున్న బోలోరో వ్యాన బోల్తా పడిన సంఘటన మునిసిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ తూర్పుగోదావరి జిల్లా తుని పశువుల మార్కెట్‌లో కోనుగోలు చేసి హైదాబాద్‌లోని కబేళాలకు వ్యానలో ఆవులను తరలిస్తున్నారు. ఈ క్రమంలో చౌటుప్పల్‌ మునిసిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం స్జేజి సమీపంలోకి రాగానే బోలోరో వ్యాన వెనక టైర్‌ పేలింది. దింతో వ్యాన జాతీయ రహదారిపై బోల్తా పడింది. వ్యానలో ఉన్న ఐదు ఆవులు తీవ్రంగా గాయపడ్డాయి. అక్రమంగా ఆవులను కబేళాలకు తరలిసున్న డ్రైవర్‌ హేమంతపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కె.యాదగిరి తెలిపారు.

Updated Date - 2023-09-20T00:04:37+05:30 IST