మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీగా కొండాపురం వాసి
ABN , First Publish Date - 2023-01-28T00:28:05+05:30 IST
ప్రభుత్వం ఇటీవల చేపట్టిన బదిలీల్లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీగా నల్లగొండ జిల్లా చండూరు మండలం కొండాపురం
చండూరు రూరల్, జనవరి 27 : ప్రభుత్వం ఇటీవల చేపట్టిన బదిలీల్లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీగా నల్లగొండ జిల్లా చండూరు మండలం కొండాపురం గ్రామానికి చెందిన కొత్తపల్లి నర్సింహగౌడ్ బాధ్య తలు స్వీకరించారు. ఈయన 2010లో డీఎస్పీగా పోలీ్‌సశాఖలో చేరి ఆర్మూర్, గుంటూరు, కామారెడ్డి, వరంగల్ సెంట్రల్ జోన డీసీపీగా, రాష్ట్ర గవర్నర్ తమిళిసై వ్యక్తిగత సహాయకుడిగా విధులు నిర్వహించారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్‌గౌడ్‌కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.