బెల్లి లలితకు ఘన నివాళి
ABN , First Publish Date - 2023-04-30T00:01:04+05:30 IST
తెలంగాణ గాయకురాలు బెల్లి లలిత జయంతిని పురస్కరించుకొని శనివారం భువనగిరిలో ఘన నివాళులు అర్పించారు.
భువనగిరి టౌన్/ మోత్కూరు, ఏప్రిల్ 29: తెలంగాణ గాయకురాలు బెల్లి లలిత జయంతిని పురస్కరించుకొని శనివారం భువనగిరిలో ఘన నివాళులు అర్పించారు. ప్రజా సమస్య పరిష్కారినికి, తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతపై దశాబ్దాల క్రితమే ఆమె పోరుబాట పట్టిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు తంగెళ్లపల్లి రవికుమార్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రావుల రాజు, భట్టు రాంచంద్రయ్య, బెల్లి చంద్రశేఖర్, మాయ కృష్ణ, కొలుపుల వివేకానంద, చల్లగురుగుల రఘుబాబు, పుట్ట వీరేశ్‌యాదవ్ పాల్గొన్నారు. బెల్లి లలిత తెలంగాణ మలి దశ ఉద్యమంలో తన ఆట,పాటలతో తెలంగాణ ప్రజలను చైతన్యం చేసిందని, ఆమె సేవలు మరవలేనివని బీసీ రిజర్వేషన్ సాధన సమి తి రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ అన్నారు. బెల్లి లలిత జయంతి సందర్భంగా మోత్కూరులో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో ఆమె కుమారుడు శ్రీరామ్‌మురళీకృష్ణ, నాయకులు బయ్యని రాజు, అన్నందాసు మణికంఠ, బుంగపట్ల శ్రీహరి, అనంతయ్య, ప్రవీణ్ ఉన్నారు.