వైభవంగా సీత్లా పండుగ

ABN , First Publish Date - 2023-07-12T01:47:45+05:30 IST

జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం గిరిజనుల ఆరాధ్య దైవం సీత్లా పండుగను నిర్వహించారు.

 వైభవంగా సీత్లా పండుగ
ఆత్మకూర్‌(ఎస్‌) మండలంలోని సీత్లా పండుగను నిర్వహిస్తున్న గిరిజనులు

కోదాడ టౌన, తుంగతుర్తి, అర్వపల్లి, తిరుమలగిరి రూరల్‌, ఆత్మకూర్‌ (ఎస్‌), జూలై 11: జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం గిరిజనుల ఆరాధ్య దైవం సీత్లా పండుగను నిర్వహించారు. సీత్లా పండుగ గిరిజన సంప్రదాయానికి ప్రతిబింబమని కోదాడ మునిసిపల్‌ చైర్‌పర్సన వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ అన్నారు. పట్టణంలోని బాలాజీనగర్‌లో నిర్వహించిన సీత్లా పండుగలో పాల్గొని ఈ సందర్భంగా నిర్వహించిన పూజల్లో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించారు.

- తుంగతుర్తి మండలంలోని సూర్యతండా గ్రామపంచాయతీలోని గుట్టకింద తండాలో నిర్వహిం చిన సీత్లా పండుగలో బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, సర్పంచ లాకావత యాకునాయక్‌, రాంధన నాయక్‌, రవినాయక్‌, భిక్షం, రమేష్‌, శ్రీను పాల్గొన్నారు.

- అర్వపల్లి మండలంలోని తూర్పుతండా, సూర్యనాయక్‌తండా, పడమటితండా, గన్యానాయక్‌ తండాల్లో సీత్లా పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహిం చారు. కార్యక్రమంలో పద్మ, శ్రీను, బాలు, పాంచ్యా, బూర్య, మంగ్తా, భిక్షం పాల్గొన్నారు.

-తిరుమలగిరి మండలంలోని హేమ్లా తండా, మొండిచింతతండాలో గిరిజనులు సీత్లా పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మనుషులకు, పశువులకు అంటువ్యాధులు సోకకుండా ఉండాలని, పాడి పంటలు సమృ ద్ధిగా పండాలని సీత్లాభవానిని కోరుకుంటూ చెరువు ఒడ్డున పండుగను నిర్వహించారు.

- ఆత్మకూర్‌(ఎస్‌) మండలంలోని అన్ని తండాల్లో సీత్లా పండుగను వైభవంగా నిర్వహించారు. దుబ్బతండా, కోటినాయక్‌ తండా, బొట్టతండా, మంగలి తండా, రామోజీ తండా, బోరింగ్‌ తండాల్లో పండుగ నిర్వహించారు.

Updated Date - 2023-07-12T01:47:59+05:30 IST