నల్లగొండ-ధర్మాపురం వరకు రూ.100 కోట్లతో నాలుగు లేన్ల రోడ్డు
ABN , First Publish Date - 2023-12-11T00:04:21+05:30 IST
జిల్లా కేంద్రం నల్లగొండ నుంచి ముశంపల్లి మీదుగా ధర్మాపురం వరకు రూ.100 కోట్లతో నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం చేపడతామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని సచివాలయంలోని ఐదో అంతస్థులో తన కార్యాలయంలో వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.
రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
మంత్రిగా సచివాలయంలో బాధ్యతల స్వీకరణ
నల్లగొండ, డిసెంబరు 10: జిల్లా కేంద్రం నల్లగొండ నుంచి ముశంపల్లి మీదుగా ధర్మాపురం వరకు రూ.100 కోట్లతో నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం చేపడతామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని సచివాలయంలోని ఐదో అంతస్థులో తన కార్యాలయంలో వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ-ధర్మాపురం రోడ్డుకు రూ.100 కోట్లతో వారం రోజుల్లో టెండర్ పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. కాగా, బాధ్యతలు తీసుకున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని పలువురు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.