Share News

Minister Mallareddy: మంత్రి మల్లారెడ్డి అనుచరుడి ఇంట్లో సోదాలు

ABN , First Publish Date - 2023-11-25T09:19:35+05:30 IST

మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy) అనుచరుడైన బీఆర్‌ఎస్‌ బోడుప్పల్‌ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి

Minister Mallareddy: మంత్రి మల్లారెడ్డి అనుచరుడి ఇంట్లో సోదాలు

ఉప్పల్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy) అనుచరుడైన బీఆర్‌ఎస్‌ బోడుప్పల్‌ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి(Manda Sanjeeva Reddy) ఇంట్లో మేడ్చల్‌ ఎన్నికల అధికారులు, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు తనిఖీలు చేశారు. మందా సంజీవరెడ్డి నివాసానికి మంత్రి మల్లారెడ్డి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు చేరిందన్న ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌(Flying Squad) అధికారులు, పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం సంజీవరెడ్డిని ఇంటికి చేరుకొని ఆయనను బయటకు వెళ్లకుండా అడ్డుకొని ఇంట్లో సోదాలు చేశారు. ఈ సోదాల్లో ఎలాంటి డబ్బు దొరకకపోవడంతో అధికారులు వెనుదిరిగారు. అయితే, సంజీవరెడ్డి ఇంటి ముందు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు పరస్పరం నినాదాలు చేసుకున్నారు. కొంత ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ డబ్బులు దొరకకపోవడంతో ఇరు పక్షాల నాయకులు వెనుదిరిగారు.

Updated Date - 2023-11-25T09:19:36+05:30 IST