KTR : మంత్రి మల్లారెడ్డి మాట్లాడాక మాట్లాడితే యాటకూర తిన్నాక.. తోటకూర తిన్నట్టుంటది

ABN , First Publish Date - 2023-06-08T13:31:31+05:30 IST

మంత్రి మల్లారెడ్డి మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే.. యాటకూర తిన్నాక.. తోటకూర తిన్నట్లు ఉంటదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అడ్డాకుల మండలం వేముల- పొన్నకల్ గ్రామ శివారులో యస్‌జీడీ కార్నింగ్ టెక్నాలజీ కంపెనీ రెండవ యూనిట్‌కు మంత్రి కేటీఆర్ భూమి పూజ నిర్వహించారు.

KTR : మంత్రి మల్లారెడ్డి మాట్లాడాక మాట్లాడితే యాటకూర తిన్నాక.. తోటకూర తిన్నట్టుంటది

మహబూబ్ నగర్ : మంత్రి మల్లారెడ్డి మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే.. యాటకూర తిన్నాక.. తోటకూర తిన్నట్లు ఉంటదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అడ్డాకుల మండలం వేముల- పొన్నకల్ గ్రామ శివారులో యస్‌జీడీ కార్నింగ్ టెక్నాలజీ కంపెనీ రెండవ యూనిట్‌కు మంత్రి కేటీఆర్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దేవరకద్రలో అప్పుడు 2014లో కేవలం 40 వేల ఎకరాల భూమికి సాగు నీరు అందేదని.. ఇపుడు ఎక్కడికక్కడ 30 చెక్ డామ్ లు కట్టడంతో.. లక్ష ఎకరాలకు సాగు నీరు అందుతోందన్నారు. కర్వెన పూర్తి అయితే మరో 60 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు.

ఎన్నికలు వస్తే బీజేపీ.. కాంగ్రెస్ వాళ్లు గంగిరెద్దుల వాళ్లు వచ్చినట్లు వస్తారని.. మోసపూరిత మాటలు చెబుతారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రైవేట్ కంపెనీలు వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. ప్రైవేట్ కంపెనీల యాజమాన్యాలను మనం కంటికి రెప్పలా కాపాడాలన్నారు. జీవశాస్త్ర విజ్ఞాన పెట్టుబడుల హబ్‌గా తెలంగాణ విరాజిల్లుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-06-08T13:31:31+05:30 IST