గాంధీ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలి
ABN , First Publish Date - 2023-01-22T23:58:46+05:30 IST
జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాల ని గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
గుమ్మడిదల గ్రామపంచాయతీ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ
గుమ్మడిదల, జనవరి 22: జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాల ని గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. గుమ్మడిదల గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆదివారం ఉదయం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి స్థానిక ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మహాత్మగాంధీ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమన్నారు. నేటి తరాలకు మహాత్మాగాంధీ చరిత్ర తెలియజేసే విధంగా ప్రతీ గ్రామ పంచాయతీ ఆవరణలో విగ్రహాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రధాన కూడళ్లలో సైతం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విగ్రహావిష్కరణలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ ప్రవీణా విజయభాస్కర్‌రెడ్డి, జడ్పీటీసీ కుమార్‌గౌడ్, సీనియర్ నాయకుడు చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి, సర్పంచ్ నర్సింహారెడ్డి, నాయకులు సద్ది విజయభాస్కర్‌రెడ్డి, ఆలేటి శ్రీనివా్‌సరెడ్డి, ఆలయ కమిటీ, రైతు సంఘం అధ్యక్షుడు మద్దుల బాల్‌రెడ్డి, పోచుగారి మోహన్‌రెడ్డి, వార్డు సభ్యులు రవీందర్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, సత్యనారాయణ, ఆంజనేయులు, రాము పాల్గొన్నారు.
దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ
జిన్నారం, జనవరి 22: సీఎం కేసీఆర్ సారథ్యంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా మారిందని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే సమక్షంలో జిన్నారం గ్రామానికి చెందిన పలు పార్టీల యువకులు అరుణ్, వికాస్, రోహిత్, బాలేష్, నవీన్, రాజు, నితీష్ తదితరులు బీఆర్‌ఎ్‌సలో చేరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీటీసీ వెంకటేశంగౌడ్, ఉస సర్పంచ్ సంజీవ, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు రాజేశ్ పాల్గొన్నారు.