నాకు బలం, బలగం మీరే

ABN , First Publish Date - 2023-06-01T00:34:17+05:30 IST

జహీరాబాద్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలే నా బలం, బలగమని జహీరాబాద్‌ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు పేర్కొన్నారు.

 నాకు బలం, బలగం మీరే

ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే మాణిక్‌రావు

న్యాల్‌కల్‌, మే 31: జహీరాబాద్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలే నా బలం, బలగమని జహీరాబాద్‌ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని గంగ్వార్‌వద్ద గల ఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమఫలాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. కేసీఆర్‌ హాయాంలో సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకే అందుతున్నాయని చెప్పారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజలు బీఆర్‌ ప్రభుత్వాన్ని ఆదరించి ఆశీర్వదించాలని ఆయన కోరారు. కార్యక్రమంలోడీసీఎంఎస్‌ చైర్మన్‌ మల్కాపురం శివకుమార్‌, సీడీసి చైర్మన్‌ ఉమాకాంత్‌పాటీల్‌, ఆత్మచైర్మన్‌ పెంటారెడ్డి, మండల బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు మున్నూరు రవీందర్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-01T00:34:17+05:30 IST