మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
ABN , First Publish Date - 2023-03-05T00:08:41+05:30 IST
ప్రపంచ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని సిద్దిపేట పట్టణంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని, విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్
సిద్దిపేట టౌన్, మార్చి 4 : ప్రపంచ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని సిద్దిపేట పట్టణంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని, విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్ అధికారులను ఆదేశించారు. సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాట్లను జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ, అధికారులతో కలిసి కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ బాలుర పాఠశాలలో 3 వేల మంది వివిధ రంగాలకు చెందిన మహిళలతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వివరించారు. భారీ సంఖ్యలో మహిళలు వస్తున్నందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా సభావేదిక, సౌండ్ సిస్టమ్, షామియానా, తాగునీరు, మహిళా సంబంధిత స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్ సభా ఏర్పాట్లు, డీఆర్డీవో, మెప్మా గుర్తించిన మహిళా ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తదితర మహిళలు హాజరయ్యేలా చూడాలన్నారు. అనంతరం మైదానంలో చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన, కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. వస్త్రాలు చాలా బాగున్నాయని మహిళా దినోత్సవం వరకు స్టాల్స్ కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ దేవారెడ్డి, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, డీఆర్డీవో గోపాల్‌రావు, డీపీవో దేవికదేవి, సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్, మంత్రి ఓఎస్డీ బాలరాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, డీఎంహెచ్‌వో కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.